31 మార్చి, 2012

మిణుగురు పురుగు సమయస్ఫూర్తి


అనగనగా ఒక అడివిలో ఒక మిణుగురు పురుగు వుండేది. అడవిలో సంతోషంగా తిరుగుతూ వుండేది. ఒక రోజు ఒక కాకి వచ్చి ఆ మిణుగురు పురుగును తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, “ఆగు! నా మాట వింటే నీకే మేలు” అని అరిచిందా పురుగు.

కాకి “యేమిటది” అని అడిగింది.“నీకు నా లాంటి చాలా పురుగులున్న చొటొకటి చూపిస్తాను. నన్ను తినేస్తే నీకేమీ లాభం లేదు” అన్నదా పురుగు. కాకి అత్యాశతో ఒప్పుకుంది.ఆ పురుగు కొంత మంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది. నిప్పురవ్వలను చూపించి అవన్ని మిణుగురు పురుగులని చెప్పింది.

కాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పు రవ్వలను మింగేసింది. సుర్రని నోరు కాలింది. బాబోయి, ఈ మిణుగురు పురుగలను మనం తినలేమని యెగిరిపోయింది. ఆ పురుగు “బలం కన్నా బుద్ధి గొప్పా” అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుంది!

జిత్తులమారి నక్క


అనగనగా ఒక పెద్ద అడవి. అందులో ఒక నక్క ఉండేది. అది మహా జిత్తులమారి. అది ఓసారి సరదాగా షికారుకు బయల్దేరింది. అలా వెళ్తూ వెళ్తూ కాలు జారి, ఓ పాడుబడిన బావిలో పడిపోయింది. అది కాస్త లోతుగా ఉండటంతో బయటికెలా రావాలో అర్థం కాలేదు. పైకి ఎగిరింది. గోడ ఎక్కాలని ప్రయత్నించింది. ఏం చేసినా పైకి రాలేకపోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అక్కడికి ఓ మేక వచ్చింది.

మేక అసలే దాహంతో ఉంది. నీళ్లకోసం బావిలోకి తొంగి చూసింది. దానికి నక్క కనబడింది. అది అక్కడ ఏం చేస్తున్నదో తెలుసుకోకుండా -‘‘నక్క బావా, నక్క బావా! బావిలో బాగా నీళ్లున్నాయా’’ అని అడిగింది. బావిలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న నక్కకు మంచి ఉపాయం తట్టింది.

‘‘ఓ.. లేకేం! ఎంత తోడినా తరగనన్ని నీళ్లున్నాయి. వచ్చి తాగు’’ అంది. మంచి దాహంతో ఉన్న మేక, వెనకా ముందూ ఆలోచించకుండా బావిలో దూకేసింది. అప్పుడుగానీ దానికర్థం కాలేదు. ‘‘అయ్యో, ఇందులోంచి బయటికెలా వెళ్లడం’’ అంది దిగులుగా. అందుకు నక్క- ‘‘మనం బయటపడటానికి నేనో మంచి మార్గం చెప్తాను. నువ్వు నీ ముందర కాళ్లు ఎత్తి, గోడకు ఆన్చి నిలబడు. నేను నీ మీద ఎక్కి పైకి వెళ్లిపోతాను. తర్వాత నువ్వూ వచ్చేద్దువు గాని’’ అంది. 


నక్క మాటల్లోని మర్మం గ్రహించని మేక నక్క చెప్పినట్టే నిలబడింది. దాని మీద ఎక్కి ఎంచక్కా పైకి వచ్చేసింది నక్క. ‘‘మరి నేను...’’అంది మేక. ‘‘ఏమో... నాకేం తెలుసు’’ నిర్లక్ష్యంగా అంది నక్క.అప్పుడర్థమయ్యింది మేకకు నక్క చేసిన మోసం. ‘‘నన్నిలా మోసం చేయడం నీకు తగదు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.  ‘‘ఇందులో నా తప్పేముంది! నేను చెప్పగానే బావిలోకి దూకేయడం నీదే తప్పు. నీకు నువ్వే కష్టాలు కొని తెచ్చుకుని నన్నంటావేం’’ అంటూ చక్కా పోయింది. మంచి చెడులు ఆలోచించకుండా ఇతరులను గుడ్డిగా నమ్మేయడం ఎంత తప్పో తెలిసొచ్చింది మేకకి.

పిసినారి నక్క


అనగనగా ఒక అడవిలో ఒక క్క ఉండేది. అది పరమ పిసినారి. ఒకసారి దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానిని ఏ వీధి అరుగుమీదో, ఏ చెత్తకుండీచాటునో కూర్చుని తినచ్చు కదా! ఊహూ... తోటి క్కలు చూస్తే తమకూ కాస్త పెట్టమంటాయని దాని భయం. ఎందుకంటే అది ఎప్పుడూ మిగతా క్కల దగ్గర ఆహారం అడిగి తినేది. అందుకే ఆ మాంసం ముక్కను తీసుకుని చాటుగా ఊరవతలికి బయలుదేరింది. 


ఊరవతల ఒక చెట్టు మీద ఉన్న రెండు కాకులు కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్కను చూశాయి. దొరికిన ఆహారాన్ని కలిసి పంచుకుని తినే కాకులు కుక్క దగ్గర్నుంచి ఎలాగైనా సరే మాంసం ముక్కను కొట్టేయాలి అనుకున్నాయి. అందుకని అవి క్క ముందు వాలి స్నేహంగా కబుర్లు చెప్పడం మొదలు పెట్టాయి.

‘‘క్క మామా! క్క మామా! బాగున్నావా? ఊరిలో నుంచి వస్తున్నావు, ఏమిటి సంగతులు?’’ అని ఒక కాకి అడిగింది. క్క ఏమీ లేవన్నట్టు తల అడ్డంగా ఊపింది.‘‘నువ్వు మేలుజాతి క్కలా ఉన్నావు. నీలాంటి క్కను ఇంతకు ముందు మేమెన్నడూ చూడలేదు. నీతో స్నేహం చేయాలని ఉంది. చేస్తావా?’’ అంటూ పొగిడాయి. కాకుల పొగడ్తలకు పొంగిపోయిన క్క ‘సరే’ అని తలూపింది. 



వెంటనే రెండు కాకులూ సంతోషంగా అరుస్తూ క్క చుట్టూ తిరుగుతూ ఆడుకోసాగాయి. ఒక కాకి క్క వెనుకకు, మరొక కాకి క్క ముందుకు చేరాయి. వెనుకనున్న కాకి హఠాత్తుగా క్క తోక పట్టి లాగింది. ఉలిక్కిపడిన క్క మాంసపు ముక్కను నేల మీద పెట్టి వెనక్కి తిరిగి చూసింది. ఇంతలో ముందు వైపు ఉన్న కాకి ఆ మాంసపు ముక్కను నోటితో కరుచుకుని రివ్వున ఎగిరి వెళ్ళిపోయింది. పనైపోయిందిగా, ఇక రెండో కాకి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. రెండూ చెట్టు మీద కూర్చుని మాంసం ముక్కను పంచుకుని తిన్నాయి. పాపం ఆ క్క నోటమాటరాక అలా చూస్తూ ఉండిపోయింది.



నీతి: పొగడ్తలకు లొంగిపోయినవారు ఎప్పటికైనా ఇబ్బందులపాలు కాక తప్పద


30 మార్చి, 2012

అమాయక బ్రాహ్మడు


అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు వుండేవాడు. ఆ బ్రాహ్మడు యగ్నంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు. ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగమల్లేరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చొట్లకెళ్ళి నిలపడ్డారు.

మొదటి దొంగ బ్రాహ్మడు దెగ్గిర పడుతుంటే చూసి యెదురొచ్చాడు. వచ్చి, “ఆచర్యా, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి” అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు. కొంత దూరమెళ్ళాక రెండొ దొంగ యెదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని యొచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళి భుజాల మీదకు యెక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరమెళ్ళాక మూడో దొంగ యెదురయ్యాడు.

“అపచారం! అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు!” అన్నాడా దొంగ. ఇంత మంది చెపుతుంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు… ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నరు.

అందని ద్రాక్ష పుల్లన


అనగనగా ఒక నక్క ఉండేదట, ఒక రోజు అది  రైతు యెక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది. అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి. ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు నోరూరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది.

 మామూలుగా అయితే నక్కకు ఆ పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి వాటిని అందుకోబోయింది. కానీ, దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్షపళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక ఎగరలేక విసిగి,"ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి?" అని గొణుక్కుంటూ వెళ్ళిపోయింది

 అలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి ఆశాభంగం చెందినపుడు, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశారో దాన్నే చెత్తది, పనికిరానిది అని అన్నపుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు.

ఏడు చేపల కథ



ఏడు చేపల కథ తరతరాలుగు ఆంధ్ర దేశంలో తల్లులందరూ వారి పిల్లలకు చెప్తూ వస్తున్న కథ.
 అనగనగా ఒక రాజ్యం ఉండేదట. ఆ రాజ్యానికో రాజు. రాజుకు ఏడుగురు కొడుకులుండేవారట. ఒకసారి రాజుగారి ఏడుగురు కొడుకులూ, చేపల వేటకని బయలుదేరి వెళ్ళారట. ఏడుగురు కొడుకులూ కలసి ఏడుచేపలు పట్టారట. పట్టుకొచ్చిన ఏడుచేపలనూ ఒక బండ మీద ఆరబెట్టారట. 

అందులో పెద్దవాడి చేప మాత్రం ఎండలేదట. పెద్దకొడుకు చేపతో, చేపా! చేపా! ఎందుకెండలేదు? అని అడిగాడట. అందుకు బదులుగా ఆ ఎండబెట్టిన చేప, " గడ్డివాము అడ్డం వచ్చింది, అందుకనే ఎండలేదు" అని చెప్పిందట. రాకుమారుడు గడ్డివాము దగ్గరికెళ్ళి దానితో, "గడ్డివామూ! గడ్డివామూ! ఎందుకు అడ్డం వచ్చావు?" అని అడిగాడట. అప్పుడా గడ్డివాము "ఆవు నన్ను మేయలేదు" అని అన్నదట.  ఈసారి రాకుమారుడు ఆవు దగ్గరికెళ్ళి "ఆవూ! ఆవూ! నువ్వెందుకు గడ్డి మేయలేదు?" అని అడిగాడట. అప్పుడా ఆవు, "జీతగాడు నాకు మేత వేయలేదు" అని చెప్పిందట. 

"జీతగాడా! జీతగాడా! నువ్వెందుకు మేత వేయలేదు?" అని అడిగాడట. " అవ్వనాకు బువ్వ పెట్టలేదు" అని జీతగాడు చెప్పాడట. "అవ్వా! అవ్వా! జీతగానికి ఎందుకు బువ్వ పెట్టలేదు?" అని అడిగాడట రాకుమారుడు. " పాప ఏడుస్తోంది. అందుకనే నాకు వీలుకాలేదు" అని అవ్వ చెప్పిందట. "పాపా! పాపా! ఎందుకు ఏడుస్తున్నావు?" అని పాపనడిగాడట రాకుమారుడు. "నన్ను చీమ కుట్టింది" అని పాప అన్నదట. 


రాకుమారుడు చీమను వెళ్ళి అడిగాడట, "చీమా! చీమా! ఎందుకు పాపను కుట్టావు?"అని. అప్పుడు చీమ అన్నదట, "నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా! గిట్టనా!" అని.........!


29 మార్చి, 2012

అపరిమిత బలము కలిగిన భీముడు ఒక పాము చేతిలో బంధీకృతుడు కావడo

ఒకరోజు భీముడు వేటనిమిత్తం హిమాలయ శిఖరం మీదకు వెళ్ళాడు. అక్కడ ఒక కొండచలువ భీముని ఆహారంగా పట్టుకుంది. అది భీముని తన శరీరంతో చుట్టేసింది. భీముని బలం ఆ కొండచిలువ బలం ముందు చాలలేదు. భీముడు ఆశ్చర్యపడి "నా వంటి బలవంతుని ఇలా బంధించే శక్తి నీకు ఎలా వచ్చింది? నీవు వరప్రసాదివా? " అని అడిగాడు. ఆ కొండచిలువ భీమునితో ఇలా పలికింది " భీమసేనా నేను నహుషుడు అనే మహారాజును. ఒకప్పుడు దేవేంద్రపదవిని అధిష్టించాను. కాని ఒకమునివరుని శాపం వలన సర్పరూపం దాల్చాను " అని దు॰ఖించాడు. 
ఇంతలో భీమసేనుడు కనపడలేదని కలత పడి ధర్మరాజు అతడిని వెతుకుతూ వచ్చాడు. కొండచులువ బంధించి ఉన్న భీముని చూసి " ఆహా ఏమి కాల మహిమ? అపరిమిత బలము కలిగిన భీముడు ఒక పాము చేతిలో బంధీకృతుడు కావడమా? " అనుకున్నాడు. ధర్మరాజు కొండచిలువను చూసి " అయ్యా నీవు ఎవరు? రాక్షసుడివా దేవతవా చెప్పు. నేను పాండురాజు పుత్రుడను. నా పేరు ధర్మరాజు. నీవు నా తమ్ముని కేవలం ఆహారం కొరకు పట్టుకుంటే అతడిని విడిచిపెట్టు. నేను నీకు తగినంత మృగమాంసం సమకూరుస్తాను " అన్నాడు. ధర్మజా! నేను నీవంశంలో పుట్టిన వాడను. నా పేరు నహుషుడు. నేను ఇంద్రుడితో సమానుడను. ఐశ్వర్య గర్వంతో వివేకం లేక సప్తఋషులతో పల్లకి మోయించుకుని వారిని అవమానించాను.ప్రత్యేకంగా అగత్యుడిని అవమానించి కారణంగా అతడు నన్ను పాముగా పడి ఉండమని శపించాడు. ఆశాపప్రభావంతో ఇక్కడ సర్పరూపంలో పడి ఉన్నాను. 
నా శాపవిమోచనం కొరకు నాకు పూర్వజన్మ స్మృతి ఉండేలా అనుగ్రహించమని వేడుకున్నాను. అగస్త్యుడు కరుణించి నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చ్ప్తారో వారి వలన శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. ఆ మహానుభావుని కొరకు నిరీక్షిస్తూ ఇలా పడి ఉన్నాను. నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముని విడిపించుకో. ధర్మరాజు "అయ్యా! నీవు అడిగే ప్రశ్నలకు విజ్ఞులైన బ్రాహ్మణులు మాత్రమే చెప్పగలరు నాకు సాధ్యమా? అయినా ప్రయత్నిస్తాను. అడుగు " అన్నాడు.కొండచిలువరూపంలో ఉన్న నహుషుడు మొదటి ప్రశ్న ఇలా వేసాడు.ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడు? అతను తెలుసుకోదగిన విష్యమేమిటి? ". జవాబుగా ధర్మరాజు " సత్యము, క్షమ, దయ, శౌచము, తపము, దానము, శీలము మొదలైన గుణములు కలిగిన వాడు బ్రాహ్మణుడు. సుఖము దు॰ఖము ఎడల సమబుద్ధి కలిగి ఉండటమే అతను తెలుసుకోదగిన ఉత్తమ విద్య " అన్నాడు. 
నహుషుని రెండవ ప్రశ్న " శూద్రుడు పైన చెప్పిన గుణములు శూద్రునిలో కనిపిస్తే అతను బ్రాహ్మణుడు అని పిలువబడతాడా? అలా అయితే కుల విభాగములు ఎందుకు? అధికులు హీనులు అనే వివేకం అపార్ధం కాదా? ధర్మరాజు " మహాత్మా! ఏకారణం చేతనైనా వర్ణసంకరం ఏర్పడినప్పుడు ఎవరు ఏ వర్ణమునకు చెందిన వారు అని తెలియజేయుటకు స్వాయంభువమనువు ఒక పరీక్ష పెట్టాడు. సత్యమూ మొదలగు గుణములు శూద్రుడు ఉత్తమమైన శూద్రుడు కాగలడు కాని బ్రాహ్మణుడు కాగలడా? అదే విధంగా సత్యమూ మొదలగు గుణములు లేని వాడు బ్రాహ్మణుడు కాగలడా? కనుక ఒక వ్యక్తి గుణములు నిర్ణయించుటకు అతని గుణశీలములు ముఖ్యము. గుణశీలములు కలవాడు ఇంకా ఉత్తముడు కాగలడు. గుణశీలములు లేనివాడు వాటిని కాపాడుకోలేడు. కనుక ధనాన్ని రక్షించటం కంటే గుణశీలములు కాపాడుకోవడం ఉత్తమం " అని జవాబిచ్చాడు.
 నహుషుని మూడవ ప్రశ్న. " పరులకు అపకారం చేసి, అసత్యములు చెప్పి కూడా అహింసను కఠినంగా ఆచరించినవాడు ఉత్తమ గతులు పొందగలడు. అహింస అంత పవిత్రతను పొందింది ? " ధరరాజు " దానం చెయ్యడం, ఇతరులకు ఉపకారం చెయ్యడం, సత్యం పలకడం, అహింసను పాటించడం అనేవి నాలుగు ఉత్తమ ధర్మములు కాని వాటిలో అహింస విశేషమైంది. దేవతా జన్మ, జంతుజన్మ, మానవజన్మ అనునవి మానవునికి కలుగు జన్మలు. దానము మొదలగు కర్మలు ఆచరిస్తూ అహింసా వ్రతం ఆచరించువాడు దైవత్వాన్ని పొందుతాడు. సదా హింస చేయువాడు జంతువుగా పుడతాడు. అందుకని అహింస పరమ ధర్మంగా పరిగణించబడుతుంది " అని జవాబిచ్చాడు. ఈ సమాధానం విని దేవతా జన్మ, జంతుజన్మ, మానవజన్మ 
 భీముని వదిలాడు. తన అజగర రూపం వదిలి దివ్యమైన మానుషరూపం పొందాడు

26 మార్చి, 2012

మాట్లాడే గాడిద


ఒక రోజున అక్బర్ బీర్బల్‌లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు. తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం. సమాయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆవ్యాపారి ఎంతో సంతోషించాడు. అతను తీసుకువచ్చిన గాడిదను చూసి బీర్బల్ "మహారాజా!ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచం శ్రద్ద తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం, చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది. "అన్నాడు. అంతే అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. "అయితే బీర్బల్ ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా!" అని అడిగాడు మహారాజు


"అవును మహారాజా" అన్నాడు బీర్బల్ "మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం, వ్రాయటం నేర్చుకుంటుందని అంటావు అవునా!" అని అడిగాడు అక్బర్. మళ్ళీ 'అవునని' చెప్పాడు. బీర్బల్  వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణాయానికి వచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆగాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్‌కు అర్దం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్ననుఅడిగాడు.


బీర్బల్ ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈగాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించు. నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా! ఒక వేళ నువ్వన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవటం, వ్రాయాటం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. చెప్పు ఇది నీకు సమ్మతమేనా!? " అని అడిగాడు అక్బర్ చక్రవర్తి.


బీర్బల్‌కు రాజుగారి మాట మన్నించటం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది. "అలాగే మహారాజా! మీరు కోరుకున్న విధముగానే నెల రోజులలోపల ఈ గాడిదకు మాట్లాడటం, వ్రాయాటం నేర్పిస్తాను" అన్నాడు బీర్బల్. రాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. రాజుగారి సభలో ఉన్న వారంతా బీర్బల్ సాహాసానికి ఆశ్చర్య పోయారు. "ఇదంతా జరుగుతుందా నిజంగా బీర్బల్ గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పిస్తాడా?" ఒక వేళ ఆ పని చేయ లేకపోతే రాజుగారు బీర్బల్‌ను శిక్షిస్తారా? లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా?"


"అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడటమే రాని జంతువుకు బీర్బల్ చదవడం వ్రాయడం ఎలా నేర్పిస్తాడు?" "బీర్బల్‌కు ఈ సారి ఎలా అయినా శిక్ష తప్పదు. అని ఓ వర్గం వారు.." "ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించాడు. అలాగే ఈ సారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు" అని మరొక వర్గం వారు. ఈవిధంగా సభ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం బీర్బల్‌కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్‌కు వ్యతిరేకంగా ఉంది.


ఈ విధమైన ఊహాగానాలతో నెలరోజులు గడిచిపోయాయి. గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది. గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు. "బీర్బల్! గాడిదకు వ్రాయటం, చదవటం వచ్చినదా!?" కుతూహలంగా అడిగాడు అక్బర్. "చిత్తం మహారాజా" అన్నాడు బీర్బల్. బీర్బల్ సమాధానానికి సభలో ఉన్నవారంతా ఆశ్చర్య పోయారు. "గాడిదకు నిజంగా చదవటం, వ్రాయటం వచ్చిందా!" "ఎప్పటిలాగే ఈసారి కూడ బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు" "బీర్బల్‌కు ఈసారి శిక్ష తప్పదు." ఈవిధంగా తమలో తాము మాట్లడు కోసాగారు. "బీర్బల్ నువ్వు చెప్తున్నది నిజమేనా? గాడిద నిజంగా చదువుతుందా?" అడిగాడు అక్బర్ చక్రవర్తి.


"ఏదీ అయితే గాడిదతో ఏదైనా చదివించు" అడిగాడు అక్బర్ చక్రవర్తి. వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు. సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పటం మొదలుపెట్టింది. ఆవిధంగా తిప్పుతూ మూడవ పేజికి రాగానే గట్టిగా చదవటం మొదలు పెట్టింది. ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి, సభలో ఉన్న మిగతావారు ఆశ్చర్యంతో ముక్కున వేలువేసుకున్నారు.


"అద్భుతం నిజంగా అద్భుతం బీర్బల్ నీవు చాలా గొప్పవాడివి. నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు. నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి" అంటూ బీర్బల్‌ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు. బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రసంశలు స్వీకరించాడు. "అదిసరే బీర్బల్ ఇంతకి ఆ గాడిద ఏమంటున్నది.?" అని అడిగాడు మహారాజు


"అది ఏ మంటున్నదో తెలియాలంటే మనకు గాడిద బాష తెలియాలి మహారాజా!" అన్నాడు బీర్బల్. అంతే అక్బర్ చక్రవర్తికి బీర్బల్ చేసిన చమత్కారం ఏమిటో అర్దం అయ్యిది. "సరే మనకు గాడిద బాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లడుతుందో మనకు తెలియదు. ఆ విషయం ప్రక్కన పెట్టు. కాని గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది. అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది. చెప్పు బీర్బల్! నువ్వేం చేస్తావు.? పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు?" అని అడిగాడు అక్బర్.


అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు "మహారాజా! ఆరోజున గాడిదను చూచి దాన్ని మీదగ్గర మెచ్చుకుంటే ఆవ్యాపారకి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాను. అందుకే మీ ముందు అలా చెప్పాను. మీరు వెంటనే నెల రోజులు సమయం ఇచ్చి గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించమని చెప్పారు. జంతువులతో మాట్లాడించటానికి నాకు ఏలాంటి ఇంద్రజాల విధ్యలు తెలీవు కాని ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోందని కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను. తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు." అన్నాడు బీర్బల్.
అక్బర్ అందుకు అంగీకరించాడు. 


"మహారాజా! గాడిదను ఇంటికి తీసుకుని వెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమి పెట్టలేదు. దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది. మరునాడు ఇదిగో ఈపేజీలో గడ్డి పెట్టాను. అంతే అసలే ఆకలి మీద ఉంది దానికి తోడు పుస్తకం లోంచి గడ్డి కనిపిస్తుంది ఇంకేముంది గబగబ పుస్తకం తెరచి మొదటి పేజి తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది. మరునాడు రెండో పేజిలో గడ్డి పెట్టి గాడిద ముందు పెట్టాను. పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలు పెట్టింది. దాంతో రెండో రోజు కూడ పుస్తకం దాని ముందు పెట్టగానే గబగబ మొదటి పేజీ తిప్పింది. దానికేమి కనిపించ లేదు. వెంటనే రెండో పేజీ తిప్పింది. ఈసారి అక్కడ గడ్డి కనిపించింది. మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను అందులో గడ్డి పెట్టలేదు ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలు పెట్టింది. ఈవిధంగా షుమారు నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను. అంతే అదేవిధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అంటూ తను ఏవిధంగా గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.


అంతే సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టి బీర్బల్‌ను ఎంతగానో అభినందించారు. ఇక రాజుగారైతే బీర్బల్‌కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు. 

Software Engineer Cinema Kastalu


కాలేజి లో ఉన్నన్నాళ్ళు చదువులు ఎప్పుడు అయిపోతాయ్, exams నుంచి విముక్తి ఎప్పుడు వస్తుంది, job లో డబ్బులు ఎప్పుడు సంపాదిస్తాం అని తొందర పడతాం. job search లో నా .. నా తిప్పలు పడి కనపడిన ప్రతి company interview attend అయి, ఏదోలా job సంపాదిస్తాం.


Job join.


First month - no work.only enjoy - all happies


Second month - work + enjoy – ok


Third month - only work. no enjoy - problem starts



  - అప్పటికి office politics తెలుస్తాయ్.

  - పక్క team లో manager మంచోడు అయుంటాడు.

  - పక్క team లో అమ్మాయిలు బావుంటారు.

  - పక్క team లో hikes బాగా ఇస్తారు.

  - పక్క team లో work అసలే ఉండదు.

  - మనకి మాత్రం రోజు festival..


 చేసిన పనికి ... చెయ్యని పనికి దొబ్బించుకోవటమే. ఒక్కో client ఏమో పిచ్చి నా.. requirements ఇస్తాడు. అవి పని చెయ్యవు అని తెలిసి కూడా అలానే చెయ్యాలి. అర్ధ రాత్రి supportలు. onsite వాడిని బూతులు తిట్టి పారిపోదాం అనిపిస్తుంది. కానీ office లో net connection free and coffee free అనే ఒక్క ఆలోచన ఆపేస్తుంది. మనకి ఒక batch తయారవుతుంది.



ప్రతి రోజు TL, PM ని తిట్టుకుంటూ ఒక ఆరు నెలలు గడిపేస్తాం. ఇలా loop లో పెట్టి కొడితే రెండు ఏళ్ళు అయిపోతాయ్. అప్పటికి కళ్ళ చుట్టూ black circles, వేళ్ళు వంకర్లు, మెడ నొప్పులు ... పిచ్చ నా .. జబ్బులు అన్ని వచ్చేసి ఉంటాయ్. సొంత అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడి నే చుట్టం చూపుగా చూడటానికి వెళ్తుంటాం. ఒక వేళ bro/sis ఉంటే, వాళ్ళే .. s/w field లో ఉంటే .. అర్ధం చేసుకొని తిట్టటం మానేస్తారు. అలా లేకపోతే phone చేసిన ప్రతిసారి  సంజాయిషీ.


salary పడుతూ ఉంటుంది. bonds కి అని, mutual funds కి అని, credit card bills కి అని కట్టి కట్టి .. సంపాదించింది అంతా ధార పోస్తాం. ఇంకేమన్నా మిగిలితే తెలివైనోడు అయితే home loan మీద, మనలాంటి వాడు అయితే గాలి తిరుగుడు మీద తగలేసేస్తాం.



ఇలా జీవితం ప్రశాంతంగా సాగుతూ .. ఉండగా one fine day ఎవడో ఒక ex-colleague /colleague పెళ్లి settle అయింది అని పిలుస్తాడు. మనకి ఒక అమ్మాయ్ ఉంటే బావుండు అనే ఒక వెర్రి ఆలోచన పుడుతుంది. మన s/w field లో బావున్న అమ్మాయిలు అంతా booked,

married or north Indians అయి ఉంటారు. అక్కడే వంద లో 95 మంది filter అయిపోతారు. మిగతా ఐదు లో 4 మందిని "friend" కంటే అక్కా.. అని పిలవటం better అనేటట్టు ఉంటారు. ఆ మిగిలిన ఒక్క అమ్మాయ్ కోసం team అంతా కొట్టేసుకుంటూ ఉంటాం. ఆ అమ్మాయ్ ఎవరితోనూ commit అవ్వకుండానే అందరితో free గా బతికేస్తూ.. ఉంటుంది. One more fine day పెళ్లి card ఇస్తుంది. ఇంకేముంది Heart breaking లా దేవదాస్ లా గడ్డం పెంచేసుకొని .. ఆ అమ్మాయి మంచిది కాదు అని deciding. next day నుంచి ఇంకొకళ్ళకి trying.



Reviews వస్తాయ్. "నువ్వు excellent, నువ్వే లేనిదే company లేదు, కత్తి, కేక,కమాల్, etc, etc ... " అని చెప్పి ఊరించి చివర్లో .. "but" అంటారు. తీరా చూస్తే  నీ salary లో ఇంకో సనక్కాయ్ పెంచాం, పో .. అంటారు. Resume update cheyyali అని గత ఆరు నెలలు గా తీస్కుంటున్న decision ని మళ్ళా ఒకసారి స్మరించుకుని ..  అలా ఇచ్చిన సనక్కాయల మీద బతికేస్తుంటాం.



జీవితం అంటే దూరదర్శన్ లో హైదరాబాద్ ప్రసారం లానే ఉంటుందా... వేరే ప్రోగ్రామ్స్ ఏమి ఉండవా..!!! ఛీ.. ఎదవ జీవితం!!!

25 మార్చి, 2012

కాకి బావ ఉపాయం


యమునా నది ఒడ్డున ఒక అందమైన వనంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకుల జంట నివసిస్తుండేది. ఆ మర్రిచెట్టు క్రింద ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్టలో ఒక పాము ఉంటున్నది. కాకి గుడ్లను పెట్టినప్పుడు వాటిని పాము తింటుండేది. కాకులు పాముని ఏమీ చేయలేక ఏడుస్తుండేవి. ఈ విధంగా చాలా సార్లు ఆ పక్షులు పెట్టిన గుడ్లను పాము తిన్నది.

        కాకి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే ఒక నక్క చూసింది. అది కాకిని సమీపించి " కాకి బావ కాకి బావ! ఎందుకు ఏడుస్తున్నావ్ నీకు వచ్చిన సమస్య ఏమిటి? " అని అడిగింది. కాకి నక్కతో " నక్క బావా నక్కబావా నా గర్భశొకాన్ని ఎవరితో చెప్పుకొనేది నేను పెట్టిన గుడ్లను పొదిగి వాటి నుండి పిల్లలు వస్తే సంతోషించాలనుకున్నాను. అని కావ్ కావ్ మని అరుస్తుంటే విని ఆనందించాలను కున్నాను. కాని నాకు ఆ అదృష్టం లేదు" అని బాధపడింది.

         నక్క కాకితో "మీ పక్షులు గుడ్లు పెట్టడం, వాటి నుండి పిల్లలు రావడం సహజమే కదా! "అన్నది.కాకి "నిజమే కాని నా గుడ్లను పాము నిర్దయగా తింటున్నది" అని బధతో అన్నది. నక్క "మరి ఆ పాముని చంపబోయావా?" అన్నది. ఆ పని నా వల్ల కాదుకదా" అన్నది కాకి. అప్పుడు నక్క " శత్రువు బలవంతుడైనప్పుడు ఉపాయముతో అతనిని తప్పించాలి " అని నక్క వెళ్ళిపోయినది కాకి చాలా సేపు ఆలోచించినది. దానికి చక్కటి ఉపాయం తట్టింది. యమునకు సమీపమున విలాసధామం అను పట్టణం ఉన్నది. ఆపట్టణంలో అందమైన కొలను ఉన్నది. ప్రతిరోజు రాణి ఆమె చెలికత్తెలు ఆ కొలనుకి వచ్చి జలక్రీడలు ఆడతారు. ఒకరోజు రాణి చెలికత్తెలతో వచ్చింది. అందరూ తమ నగలను ఒడ్డున ఉంచి కొలనులో దిగారు. కాకి రాణి గారి ముత్యాలా హారాన్ని ముక్కున కరచుకొని ఎగిరింది. చెలికత్తెలు దానిని గమనించి భటులను హెచ్చరించారు.

     రాజభటులు కాకి వెంటబడ్డారు. కాకి నెమ్మదిగా ఎగురుతూ పుట్టవద్దకు వచ్చింది రాజభటులు కూడా దానిని వెంబడిస్తూ పుట్ట దగ్గరకు చేరారు. అపుడు కాకి ముత్యాలహారాన్ని పుట్టలో వేసి, చెట్టుపైకి ఎగిరింది. రాజభటులు హారంకోసం పుట్టను త్రవ్వారు. అపుడు పుట్ట నుండి పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. రాజభటులు దానిని ఈటెలతో పొడిచి చంపారు. భటులు ముత్యాలహారం తీసుకొని వెళ్ళిపోయారు. పాము పీడ వదలినందుకు కాకుల జంట సంతోషించాయి. 

చీమ కళా నైపుణ్యం

ఒకసారి మృగరాజు సింహానికి తన తండ్రి శిల్పం అడవిలో ప్రతిష్టించాలన్న కోరిక కలిగింది. వెంటనే కాకితో అడవంతా చాటింపు వేయించింది. శిల్ప విద్యలో ప్రవేశమున్న ఏనుగు, ఎలుగుబంటి, నక్క మృగరాజు సింహాన్ని సంప్రదించాయి. ‘శిల్పులారా! గతంలో ఈ అడవిని పాలించిన మా తండ్రి మృగరాజు సింహం శిల్పాన్ని ఆయన చనిపోయిన రోజున ప్రతిష్టించాలన్న కోరిక మాకు కలిగింది. చాటింపు విని విచ్చేసిన మీకు స్వాగతం!’’ అంటూ సాదరంగా ఆహ్వానించాడు మృగరాజు.



ఇంతలో ఓ చీమ ఆయాసపడుతూ ‘‘మృగరాజా! నేనూ మీరు వేయించిన చాటింపు వినే వచ్చాను. నాకూ అవకాశం ఇప్పించండి’’ అంది. మృగరాజు కళ్లు చిట్లించి ఆ చిన్ని చీమవైపు చూశాడు.‘‘ఏంటీ..నువ్వు కూడా శిల్పం చేద్దామనే వచ్చావా!’’ గంభీరంగా అంది సింహం. ‘‘మహారాజా! నేను మట్టితో ఎన్నో శిల్పాలు చేశాను. శిల్పవిద్యలో మా జాతికి ఎంతో పేరుంది. ఈరోజు పెద్ద పెద్దనిర్మాణాలు కట్టడాలు మేము నిర్మించిన పుట్టలు చూసి స్ఫూర్తిపొందే మానవజాతి నిర్మిస్తుంది. నాకూ ఒక అవకాశం ఇప్పించండి’’ అంది చీమ.




ఆకారంలో చాలా పెద్దగా ఉన్న ఏనుగు, ఎలుగుబంటి, నక్క చీమను చూసి నవ్వుకున్నాయి. ‘మృగరాజా! మీరు తుమ్మితే ఎగిరిపోయే చీమ శిల్పం ఏం చేస్తుంది’ అంది ఏనుగు. సింహం ఆలోచనలో పడింది. ‘నాకు నీమీద నమ్మకం కలగడంలేదు. అయినా నీకు అవకాశం ఇస్తాను. మీలో ఎవరి పనితనం గొప్పగా ఉంటే వారికి విలువైన కానుకలతోపాటు ఆస్థాన శిల్పిగా పదవి అందచేస్తాను’ అంది సింహం. సింహం తనను నమ్మకున్నా అవకాశం ఇచ్చినందుకు సంతోషించింది చీమ., ఏనుగు, ఎలుగుబంటి, నక్క శిల్ప నిర్మాణానికి కావాల్సిన పనిముట్లు, ముడి సరుకులు మృగరాజును అడిగి తెప్పించుకున్నాయి.




‘‘ఏం..చీమ మిత్రమా! నీకు పనిముట్లు ముడిసరుకులు అవసరం లేదా?!’’ అడిగింది సింహం .‘అది పనిముట్లు మోయగలదా?’ నవ్వింది ఎలుగుబంటి. ‘శిల్ప కళ అంటే ఆషామాషీ కాదు’ అంది నక్క. చీమ వాటివైపు వింతగా చూసింది. ‘‘ఏం మాట్లాడవు?! గర్జించాడు మృగరాజు. ‘‘మహారాజా! నాకు నాలుగు అడుగుల నేల ఇప్పించండి చాలు’ అంది చీమ. మృగరాజు చీమ కోరిక మీద నాలుగు అడుగుల స్థలం చూపించాడు. ఇక అవన్నీ తమ పనిలో నిమగ్నమయ్యాయి. సింహం అక్కడి నుండి వెళ్లిపోయింది.




మరుసటిరోజుకు శిల్పాలు సిద్ధమయ్యాయి. సింహం స్వయంగా శిల్పులను చేరుకుని వాటి పనితనాన్ని పరీక్షించింది. ఏనుగు, ఎలుగుబంటి, నక్క శిల్పాలు ఒకదాన్ని మించి ఒకటి అందంగా కనిపించాయి. చివరగా చీమను చేరుకుంది సింహం. చీమ తను చెక్కిన శిల్పాన్ని మృగరాజుకు చూపించింది. అంతే... మృగరాజు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి తన ఎదురుగా నిలుచున్నంత మహా అద్భుతంగా ఉందా శిల్పం. పనిముట్లు లేకుండా కేవలం మట్టితో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి మలిచిన శిల్పమది. సింహంతోపాటు ఏనుగు, ఎలుగుబంటి, నక్క ఆశ్చర్యపోయాయి. మృగరాజు చీమను దగ్గరకు తీసుకుని ‘మిత్రమా! నిన్నూ నీ ఆకారాన్ని చూసినమ్మకున్నా... నీ పనితనం చూసి నమ్ముతున్నాను. ఈ సృష్టిలో నీవే అద్భుత శిల్పివి’ అన్నాడు.




ఏనుగు, ఎలుగుబంటి, నక్క సిగ్గుపడ్డాయి. జన్మతోనే చీమలు శిల్పులని గ్రహించాయి. అందుకే అవి ఎంతో అందంగా నిర్మించుకున్న పుట్టలను పాములు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాయని తెలుసుకున్నాయి. చీమకు విలువైన కానుకలతోపాటు ఆస్థాన శిల్పి పదవి ఇచ్చి గౌరవించింది సింహం. ‘ఇతరులు మనల్నిచూసి నమ్మకున్నా.. మన పనితనం చూసి నమ్ముతారు. పనికి ఉన్న గొప్పతనం అది’ అనుకుంది చీమ.

నక్క బావ పాకశాస్త్ర ప్రావీణ్యం

నక్క బావ కొత్తగా భోజనశాల తెరిచింది. అడవిలోని జంతువులతోపాటు మృగరాజు సింహాన్ని కూడా ప్రత్యేకంగా విందుకు ఆహ్వానించింది. అడవిలోని జంతువులు, పక్షులు వీలు చూసుకుని నక్క భోజనశాలకు వెళ్లి విందారగిస్తున్నాయి. 

   పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించడంతో అతిథులకు ఎంతో రుచితో కొత్త కొత్త వంటకాలు వండి వడ్డిస్తుంది. అన్నీ లొట్టలేసుకుంటూ తిని, నక్కబావ చేతివంటను మెచ్చుకోకుండా ఉండలేకపోయాయి. ప్రతిఫలంగా అవి ఇచ్చే బహుమతులు పుచ్చుకునేది నక్క. నక్కబావ అద్భుతమైన చేతివంట గురించి రెండురోజుల్లోనే అడవంతా పాకింది. కొద్దిరోజుల్లోనే చుట్టుపక్కల అడవుల్లోకి పాకింది  దాంతో.. పక్కనున్న అడవుల్లోని జంతువులు కూడా నక్కబావ చేతివంట తినాలని ఆరాటపడేవి. ఇంత జరిగినా...అడవిరాజు సింహం మాత్రం నక్కబావ తెరిచిన భోజన శాలకు రావడం కుదరలేదు. పక్కనున్న అడవుల నుంచి కూడా వచ్చి రుచి చూసి పోతున్న విషయం దానికి తెలిసింది.

నక్క రాజుగార్ని ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ వీలు చిక్కక పోవడంతో వెళ్లలేకపోయింది. కానీ ఇప్పుడు వెళ్లాలని నిశ్చయించుకుంది సింహం.

దుప్పిని తినగా అంటిన రక్తాన్ని తుడుచుకుంటూ నక్క తెరిచిన భోజనశాలకు వెళ్లే ఏర్పాట్లు చేయమని మంత్రి తోడేలును ఆదేశించింది. మృగరాజు తన పరివారంతో భోజనశాలకు వస్తున్నట్టు నక్కకు వార్త అందింది. ఈ రోజు ఇంకా ప్రత్యేకంగా వంటలు చేసింది. రాజుగారికి ఎదురెళ్లి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి, ప్రేమతో దగ్గరుండి వడ్డించింది నక్క.

రాజుగారితో విచ్చేసిన తోడేలు, ఎలుగుబంటి, ఏనుగు లొట్టలేసుకుంటూ తినసాగాయి. కానీ సింహం మాత్రం లొట్టలేయలేదు. ఏదో తిన్నానని అనిపించింది. సింహం తృప్తిగా తినలేదని నక్క గ్రహించింది. లొట్టలేసుకుని తింటే విలువ తగ్గుతుందని సింహం భావించింది కాబోలనుకుంది.
నక్కకు ఖరీదైన కానుకలిచ్చి అక్కడినుండి తన పరివారంతో ముందుకు కదిలాడు మృగరాజు. ‘‘వంటకాలు ఎంత రుచిగా ఉన్నాయో..! నేనింత వరకు ఇంత కమ్మని వంట తిని ఎరుగను’’ అంది ఎలుగుబంటి. ‘‘నిజమే! అన్ని వంటలూ ఎంతో రుచిగా ఉన్నాయి’’ అన్నాయి ఏనుగు, తోడేలు. దాంతో.. సింహానికి చిరాకేసింది.
‘‘ఆపండి మీ తిండిగోల..!’’ అంటూ కసురుకుంది. తనకు అస్సలు ఆ వంటల్లో ప్రత్యేకతే కనపడలేదంది. పైగా రుచిగా కూడా లేవంది. అడవి అడవంతా నక్కబావ చేతివంట మెచ్చుకుంటుంటే... ఒక్క సింహానికే ఎందుకు నచ్చలేదో వారికి ఆ క్షణం అర్థం కాలేదు. సింహం తృప్తిగా తినలేకపోయిందని నక్క బాధ పడిన విషయం మంత్రి తోడేలుకు తెలిసింది. ఈ విషయమై లోతుగా ఆలోచించింది. ఒక నిర్ణయానికి వచ్చింది. నక్కను బాధపడొద్దని, త్వరలోనే రాజుగారు మరోమారు విందుకు వస్తారని ఈ సారి తప్పనిసరిగా మెచ్చుకుంటారని తోడేలు కబురు పంపింది.
ఒకరోజు సాయంత్రం తోడేలు రాజుగారిని నక్క భోజనశాలకు వెళ్లేలా ఒప్పించింది. సింహం అనాసక్తిగానే తిరిగి తన పరివారంతో విందుకు వెళ్లింది. ఈసారి సింహం లొట్టలేసుకుని తిన్నది పైగా ‘‘ఇప్పుడు ఎంతో రుచిగా ఉన్నాయి కదా..!?’’ అంటూ తనతో వచ్చిన వాటిని ఉత్సాహపరిచింది.
‘‘రాజా! నక్క వంటలో ఏమాత్రం తేడాలేదు. అప్పుడు, ఇప్పుడు రుచిగానే వండింది. కానీ గతంలో మీరు ఆకలితో లేరు. అప్పుడే దుప్పిని వేటాడి, ఆరగించి ఇక్కడ విందుకు కూర్చున్నారు. ఇప్పుడు ఆకలితో ఉన్నారు కాబట్టి అసలు రుచి తెలిసింది అంది తోడేలు. తన పొరపాటు గ్రహించి నక్కను తిరిగి అభినందించి, బహుమతులిచ్చి సంతోషంగా అక్కడి నుంచి తన పరివారంతో వెనక్కు వెళ్లాడు మృగరాజు. 

ముసలి గ్రద్ద

భాగీరథి నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. దాని తొర్రలో "జరద్గవము" అను ముసలి గద్ద నివసిస్తుండేది. పాపం ఆగద్దకు కళ్ళు కనిపించవు. అందువలన అది ఆహారం సంపాదించడం కష్టమయ్యేది.
ఆ చెట్టుపై అనేక పక్షులు గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి. ఆ పక్షులు తాము తెచ్చిన ఆహారంలో కొంత భాగాన్ని గద్దకు పెడుతుండేవి. ఆ ఆహారంతో గ్రద్ద జీవిస్తూ ఉండేది.ఓకరోజు దీర్ఘకర్ణము అను పిల్లి చెట్టుపై ఉన్న పక్షి పిల్లలను తినాలని చెట్టువద్దకు నిశబ్దముగా చేరింది. దనిని చూచిన పక్షి పిల్లలు భయంతో అరిచాయి. వాటి అరుపులు విని గద్ద ఎవరో వచ్చారని గ్రహించింది. "ఎవరక్కడ?" అని గట్టిగా అరచింది.
గద్దను చూచి పిల్లి భయపడింది. దనికి తప్పించుకొనే అవకాశం లేదు. అందువలన అది వినయంగా గద్దతో "అయ్యా! నా పేరు దీర్ఘకర్ణుడు. నేనొక పిల్లిని. మీ దర్శనము కొరకు వచ్చాను" అన్నది. గద్ద కోపంగా "ఓ మార్జాలమా! వెంటనే ఇచటి నుండి పారిపో లేదంటే చచ్చిపోతావు"అన్నది. పిల్లి గద్దతో "అయ్యా మీరు పెద్దలు. మీరు గొప్ప ధర్మాత్ములని తెలిసి వచ్చాను."
పిల్లి జాతిలో పుట్టినా నేను రోజు గంగలో స్నానం చేస్తాను, కేవలం శాకాహరం తింటూ జీవిస్తున్నాను. మాంసాహారం మానివేసిచాంద్రాయణ వ్రతంను ఆచరిస్తున్నాను. మీరు మంచివారని, మీ వద్ద ధర్మశాస్త్ర విశేషాలు తెలుసుకోవాలని వచ్చాను. వచ్చిన అతిథిని శత్రువయినను గౌరవించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కాని మీరు నన్ను తరిమేస్తున్నారు" అన్నది.
గద్ద పిల్లి మాటలకు మెత్తబడింది. "చెట్టు పైన పక్షిపిల్లలున్నాయి. పిల్లులకు మాంసం అంటే ఇష్టం కదా. అందుకని నిన్ను వెళ్లమన్నాను." అంది. పిల్లి తన రెండు చెవులు మూసుకొని "కృష్ణ! కృష్న పూర్వజన్మలో ఏంతో పాపం చేసి ఈ జన్మలో పిల్లిగా పుట్టాను. అందువలనే ఇంత ఖటినమైన మాటలు వినవలసి వస్తుంది. అయ్యా! మీ మీద ఒట్టు.
నేను మాంసమును ముట్టను. అహింసయే పరమ ధర్మము అను సూత్రమును నమ్మినదానిని" అన్నది. గ్రద్ద పిల్లిని అనునయిస్తూ "కోపగించకు. కొత్తగా వచ్చిన వారి గుణ శీలములు తెలియవు కదా. అందువలన ఆ విధముగా పరుషంగా మాట్లాడినాను. ఇకనుంచి నీవు నా వద్దకు రావచ్చు..... పోవచ్చు. నీకు అడ్డులేదు " అన్నది. పిల్లి ఎంతోషంతోషించింది.
పిల్లి గద్దతో స్నేహం చేయసాగింది. కొద్ది రోజులు గడిచాయి. పిల్లి గద్దను పూర్తిగా నమ్మింది. గద్దతో పాటు తొఱ్ఱలో ఉండసాగింది. అర్థరాత్రి సమయంలో చప్పుడు చేయకుండా చెట్టెక్కి పక్షి పిల్లల గొంతును కొఱికి, వాటిని చంపేది. పక్షిని తొఱ్ఱలోకి తెచ్చుకొని దానిని తిన్నది. ఈ విధంగా కొద్ది రోజులు జరిగాయి.
పక్షులు తమ పిల్లలు కనిపించక తల్లడిల్లాయి వాటికోసం వెదకసాగాయి. ఆ సంగతి తెలిసి పిల్లి పారి పోయింది. పక్షులు తమ పిల్లల కోసం వెతుకుతూ తోఱ్ఱ వద్దకు వచ్చాయి. తొఱ్ఱలో పక్షులు ఎముకలను చూసి , గద్దయే తమ పిల్లలను చంపి తింటున్నదని అనుకున్నాయి. అవి కోపంతో గద్దను తమ గోళ్ళతో రక్కి దానిని చంపాయి. "నీచులతో స్నేహం చేస్తే చివరకు తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని" అనుకుంటూ గద్ద చని పోయింది

24 మార్చి, 2012

శిబి చక్రవర్తి దానశీలత

మహాదానశీలి అయిన శిబి చక్రవర్తి, తన సహాయం కోసం శరణుజొచ్చిన వారికి కాదనకుండా సాయం చేసేవాడు. ఆడిన మాట తప్పడం ఆయన జీవితంలో లేదు. అందుకనే ఆయన పేరు ఈ భూమి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది. అలాంటి శిబి చక్రవర్తి జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటనను గురించిన కథను తెలుసుకుందాం...!
 ఒకసారి శిబి చక్రవర్తిని ఇంద్రుడు, అగ్నిదేవుడు పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్నిదేవుడు పావురం రూపాని ధరించి భూలోకానికి దిగివచ్చారు. రావడంతోటే డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి కాపాడమంటూ ప్రాదేయపడుతుంది. నీకేమీ భయంలేదు నేనున్నానంటూ ఆయన దానికి అభయమిస్తాడు.
అయితే డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు శిబి చక్రవర్తి వద్దకు వచ్చి... "ఈ పావురం నా ఆహారం. నువ్వు దానికి అభయమిచ్చి, నా ఆహారాన్ని నాకు కాకుండా చేశావు. ఇది నీకు తగునా...?" అంటూ ప్రశ్నించాడు.అప్పుడు శిబి చక్రవర్తి "ఈ పావురానికి ప్రాణాలు కాపాడతానని నేను అభయం ఇచ్చాను. నీకు కావాల్సింది ఆహారమే కదా..! ఈ పావురం కాక మరేదయినా ఆహారం కోరుకో ఇస్తాను..." అని చెప్పాడు.
దానికి డేగ మాట్లాడుతూ... "అయితే ఆ పావురమంత బరువు కలిగిన మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు ఇవ్వు" అని అంది.దీనికి సరేనన్న శిబి చక్రవర్తి కొంచెం కూడా తడబడకుండా త్రాసు తెప్పించి పావురాన్ని ఓ వైపు కూర్చోబెట్టి, మరోవైపు తన తొడ నుండి మాంసం కోసి పెట్టసాగాడు. ఆశ్చర్యంగా ఆయన ఎంత మాంసం కోసి పెట్టినప్పటికీ పావురమే ఎక్కువ బరువు తూగనారంభించింది.
సరే... ఇక ఇలాగ కాదు అనుకుంటూ... చివరకు శిబి చక్రవర్తి తన పూర్తి శరీరాన్ని డేగకు ఆహారంగా ఇచ్చేందుకు సంసిద్ధుడయి త్రాసులో కూర్చున్నాడు. దీన్ని చూసిన అగ్నిదేవుడు, ఇంద్రుడు తమ నిజరూపాన్ని ధరించి ఆయన త్యాగబుద్ధిని కొనియాడి, శిబి చక్రవర్తి శరీరాన్ని తిరిగి అతడికే ఇచ్చివేశారు.

23 మార్చి, 2012

ఆగస్త్యమహాముని వృత్తాంతం


పూర్వం వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండే వారు. వారిరువురు అన్నదమ్ములు.  వారిలో పెద్దవాడైన ఇల్వలుడు ఒక బ్రాహ్మణుని పూజించి అయ్యా అన్ని కోరికలు తీర్చే మంత్రం ఉపదేశించమని అడిగాడు. రాక్షసులకు అలాంటి మత్రం ఉపదేశించటానికి వీలు పడదని అతడు చెప్పాడు. తరవాత వాతాపి తమ్ముడైన వాతాపిని మేకకా మార్చి ఆ మేకను చంపి వండి ఆ బ్రాహ్మణునికి వడ్డించాడు. బ్రాహ్మణుడు భుజించిన తరవాత ఇల్వలుడు "వాతాపి బయటకురా " అన్నాడు. వెంటనే వాతాపి బ్రాహ్మణుని పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఇలా అన్నదమ్ములు అతిథులుగా పిలిచి బ్రాహ్మణులను చంపుతూ వచ్చారు.


ఒక రోజు బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న అగస్త్యుడు లేచిగురుటాకులను ఆధారం చేసుకుని వ్రేలాడుతున్న తన పితరులను చూసాడు. అగస్త్యుడు వారితో "అయ్యా! మీరెవరు? ఇలా ఎందుకు వ్రేలాడుతున్నారు " అని అడిగాడు. బదులుగా వారు "నయనా!మేము నీపితరులము. నీవు వివాహం చేసుకొనకుండా సంతాన హీనుడవ్వావు. కనుక మేముఉత్తమ గతులు లేక ఇలా అయ్యాము. కనుక నీవు వివాహం చేసుకుని సంతానం పొంది మాకు ఉత్తమగతులు ప్రసాదించు " అన్నారు. 

అగస్త్యుడు అలాగే అన్నాడు.ఆ సమయంలో విదర్భ రాజు సంతానం కోసం పరితపిస్తున్నాడు.  అగస్త్యుడు తన తపోమహిమతో అతనికి ఒక కూతురిని అనుగ్రహించాడు. ఆమె యవ్వనవతి అయ్యింది. ఆమె పేరు లోపాముద్ర. లోపాముద్రకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని విని అగస్త్యుడు లోపాముద్రను తనకిమ్మని అడిగాడు. రాజు " ఈ నిరుపేద బ్రాహ్మణుడా నాకుమార్తె భర్త. ఇతడిని చేసుకుని నా కూతురు నారచీరెలు ధరించవలసినదేనా? " అని పరితపించాడు. లోపాముద్ర తనను అగస్త్యునికి ఇచ్చి వివాహం చేయమని తండ్రిని కోరింది.

గత్యంతరం లేక ఆమె తండ్రి అలాగే ఆమెను అగస్త్యునకిచ్చి వివాహం చేసాడు. ఆమె నారచీరెలు ధరించి భర్త వెంట వెళ్ళింది. ఒకరోజు అగస్త్య్డుడు కోరికతో భార్యను చేరాడు. లోపాముద్ర "నాధా! సంతానం కోసం భార్యను కోరడం సహజం. నన్ను సర్వాలంకార భూషితను చేసి నన్ను కోరండి " అన్నది. అగస్త్య్డుడు " నా వద్ధ ధనం, ఆభరణములు లేవు వాటి కొరకు తపశ్శక్తిని ధారపోయడం వ్యర్ధం " అనుకుని ధనం కొరకు అగస్త్య్డు శతర్వురుడు అనే రాజు వద్దకు వెళ్ళాడు. శతర్వురుడు తనవద్ద ధనం లేదని చెప్పాడు. అగస్త్య్డుడు, శతర్వురుడు బృహదశ్వుని వద్దకు అనే రాజు వద్దకు వెళ్ళి ధనం అడిగాడు. ఆ రాజు కూడా తనకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని కనుక ధనం లేదని చెప్పాడు. 

        ఆ తరువాత ఆ ముగ్గురూ ధనం కొరకు త్రసదస్యుడి వద్దకు వెళ్ళారు. అతను కూడా ధనం లేదని చెప్పి "మునీద్రా! ఇల్వలుడు ధనవంతుడు. అతడిని అడిగితే మీకోరిక తీరుతుంది " అన్నాడు.వెంటనే అందరూ ఇల్వలుడి దగ్గరకు వెళ్ళారు. అగస్త్య్డు ఇల్వలుని ధనం అడిగాడు. ఇల్వలుడు మామూలుగా వాతాపిని వండి వడ్డించాడు. ముందు అగస్త్య్ని భుజించమని చెప్పాడు. ఈ విషయం గ్ర్హించిన రాజఋషులు "మునీంద్రా! ఇల్వవుడు తన తమ్ముని మేకగా మార్చి వండి మ్రాహ్మణులచే త్నిపించి అతనిని బయటకు రమ్మంటాడు. అతడు పొట్ట్ను చీల్చుకుని ఆబ్రాహ్మణుని చంపి బయటకు వస్తాడు.కనుక మీరు భుజించరాదు " అన్నారు.

అగస్త్య్డుడు చిరునవ్వు నవ్వి ఆ భోజనం తినేశాడు.అగస్త్య్డుడు పొట్టను తడుముకుని తేన్చాడు. అంతే వాతాపి జీర్ణం అయ్యాడు. ఇల్వలుడు "వాతాపీ బయటకు రా " అన్నాడు. అతను రాకపోవడంతో అతను జీర్ణం అయ్యాడని తెలుసుకుని భయపడి అగస్త్యునితో "అయ్యా మీరు కోరిన ధనం ఇస్తాను " అన్నాడు. ఆ ధనంతో అగస్త్య్డు లోపా ముద్ర కోరికను తీర్చాడు. అగస్త్య్డుడు లోపాముద్రతో "నీకు పది మందితో సమానమన నూరుగురు కొడుకులు కావాలా? లేక నూరుగురుతో సమానమైన ఒక్క కొడుకు కావాలా? లేక నూరుగురు కొడుకులతో సమానమైన వెయ్యి మంది కొడుకులు కావాలా లేక వెయ్యి మందికి సమానమైన ఒక్క కొడుకు కావాలా ? " అని అడిగాడు. అందుకు లోపాముద్ర "నాకు వేయి మందితో సమానమైన బలవంతుడూ, బుద్ధిమంతుడూ అయిన ఒక్క కుమారుని ప్రసాదంచండి " అని కోరింది. లోపాముద్ర గర్భందాల్చి తేజోవంతుడూ, గుణవంతుడూ అయిన దృఢస్యుడు అనే కొడుకును కన్నది.ఆ విధంగా అగస్త్యుడు తన పితృదేవతలకు ఉత్తమ గతులు కలిగించాడు.
  

తీర్ధయాత్రల మహిమలు

ఇంద్రియాలను త్రికరణ శుద్ధిగా పెట్టున్న వారు, దృఢమైన మనసు కలిగిన వారు, అహంకారం లేని వారు, ఇతరు ల నుండి ఏమీ ఆశించని వారు మితభోజనం చేసేవారు, ఎల్లప్పుడూ సత్యం పలికే వారు, శాంత స్వభావం కలిగిన వారు తీర్ధయాత్రలు చేసిన వారు ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. మలిన మనస్కులు, పాపాత్ములు ఎ న్ని తీర్ధాలు చేసినా ఫలితం శూన్యం.దానధర్మాలు చేయని వారు తాము చేసిన అపరాధం వలన దరిద్రులు ఔతా రు.అలాంటి వారు దరిద్రులు యజ్ఞములు చేయ లేరు.కనుక పుణ్య తీర్ధములు చేసి పుణ్యం పొందవచ్చు. 
            సాధారణంగా బ్రహ్మదేవుడు తీర్ధాలలో విహరిస్తుంటాడు. అందులో పుష్కరతీర్ధం ప్రశిద్ధమైంది. దానిలో స్నానమాచరించిన పది అశ్వ మేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ పష్కరంలో పది సంవత్సరాలు నివసిం చిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. జంబూ మార్గంలోని అగస్త్యవటం అనే తీర్ధంలో స్నానం చేస్తే అశ్వమేధం చేసి న ఫలితం వస్తుంది. కణ్వాశ్రమం, ధర్యారణ్యంయ యాతిపతనం అనే పుణ్యక్షేత్రం దర్శించిన వారికి అన్ని పాపాలు పోతాయి. ఇంకా మహాకాళం, కోటి తీర్ధం, భద్రపటంలో శివుని పూజించినా నర్మదా నదీ స్నానం, దక్షిణ నదీ స్నా నం, జర్మణ్వతీ నదీ స్నానం ఎంతో పుణ్యాన్నిస్తుంది.
      వశిష్టాశ్రమంలో ఒకరోజు నివాసం, పింగం అనే పుణ్యతీర్ధ సేవనం, ప్రభాస తీర్ధ స్నానం, వరదాన తీర్ధ స్నా నం, సరస్వతీ నదీ సంగమ స్నానం పుణ్యఫలాన్నిస్తుంది. ద్వారావతీ పురం లోని పిండారక తీర్ధంలో శివుని పూ జించినా, సాగర సింధు సంగమంలో స్నానమాచరించినా, శంకు కర్ణేశ్వరంలో శివిని పూజించినా, వసుధారా, వసు సరంలో తీర్ధమాడినా, సింధూత్తమంలో స్నానం చేసినా, బ్రహ్మతుంగ తీర్ధం సేవించినా, శక్రకుమారీ యాత్ర చేసినా, శ్రీకుండంలో బ్రహ్మదేవుని సందర్శించినా, బడబ తీర్ధంలో అగ్ని దేవుని సేవించినా ఎన్నో గోదానాలు భూదానాలు చేసిన ఫలితం వస్తుంది.
      శివుడు నివసించే దేవికాక్షేత్రాన్ని , కామ క్షేత్రాన్ని, రుద్రతీర్ధాన్ని, బ్రహ్మవాలుకాన్ని, దీర్గసత్రాన్ని సేవించిన వారికి అష్ట కామ్య సిద్ధి కలుగుతుంది. వినశనంలో మాయమైన సరస్వతీ నది నాగోద్భేద, శివోద్భేద, చమసోద్భే ద లలో స్నానం చేసిన నాగలోక ప్రాప్తి కలుగుతుంది. శశియాన తీర్ధం స్నానం సహస్ర గోదాన ఫలం వస్తుంది. రుద్ర కోటిలో శివుని అర్చించిన కైలాస ప్రాప్తి లభిస్తుంది. ధర్మజా కురుక్షేత్రం, నైమిశ తీర్ధం, పుష్కర తీర్ధం అనేవి మూడూ పవిత్ర క్షేత్రాలు. 
కురుక్షేత్రం సరస్వతీ నదికి దక్షిణంలో దృషద్వతీ నదికి ఉత్తరంలో ఉన్నది. ఆ కురుక్షేత్రంలో శమంతక పంచకం నడుమ రామహ్రదం అనే సరస్సు మధ్య పితామహుడు బ్రహ్మదేవుని ఉత్తరవేది అనే క్షేత్రం దర్శించిన వారికి సర్వపాపక్షయం కలుగుతుంది. విష్ణు స్థానంలో విష్ణు మూర్తిని పూజించినా, పారిప్లవ తీ ర్ధంలో, శాలుకినీ తీర్ధంలో, సర్పతీర్ధంలో, వరాహతీర్ధంలో, అశ్వినీ తీర్ధంలో, జయంతిలో ఉండే సోమతీర్ధంలో, కృత శౌచ తీర్ధంలో స్నానమాచరించిన ఎంతో పుణ్య ప్రాప్తి కలుగుతుంది. 
               అగ్నివట క్షేత్రంలో, ముంజవట క్షేత్రంలో శివారాధన చేసినా యక్షిణీ తీర్ధంలో స్నానం చేసినా కామ్యసిద్ధి కలుగుతుంది. జమదగ్ని కుమారుడైన పరశురాముడు, తన గొడ్డలితో రాజులందరిని వధించినప్పుడు వారి రక్తం ఐదు పాయలుగా పారింది. వాటిని శమంతక పంచకం అంటారు. అందులో పరశురాముడు తన తండ్రికి తర్పణం విడిచాడు. అప్పుడు పితృదేవతలు సాక్షాత్కరించి వరాలు కోరుకొమ్మని అడిగారు. పరశురాముడు తనకు రాజుల ను సంహరించిన పాపం నశించాలి అని తనకు పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకున్నాడు. ఈ శమంతక పంచ కం పవిత్రత సంతరించుకోవాలి అని కోరాడు. అప్పటి నుండి శమంతక పంచకం పుణ్యతీర్ధాలుగా భాసిల్లుతు న్నా యి. వాటిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. 
             కాయసోధనం, లోకోద్ధారం, శ్రీతీర్ధం, కపిల తీర్ధం, సూర్యతీర్ధం, గోభనం, శంఖినీ తీర్ధం, యక్షేంద్రతీర్ధం, సరస్వతీ నది, మాతృ తీర్ధం, బ్రహ్మావర్తం, శరవ ణం, శ్వావిల్లోమాపహం, మానుష తీర్ధం, ఆపగ నదీ తీర్ధం, సప్తఋషి కుం డం, కేదారం, కపిల కేదారం, సరకం, ఇలా స్పదం, కిందానం, కింజప్యం అనే తీర్ధాలలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యాలు కలుగుతాయి .
     నారద నిర్మిత అంబాజన్మం అనే తీర్ధంలో చనిపోతే పుణ్య లోకాలకు పోతారు.పుండరీకం అనే తీర్ధంలో ఉన్న వైతరణిలో స్నానమాడినా, ఫలకీ వనం, మిశ్రకం, వ్యాసవనం, మనోజవం, మధువటి, కౌశికీనది, దృషద్వతీ నదీ సంగమంలో సమస్త పాపాలు నశిస్తాయి. కిందర్త తీర్ధంలో తిలోదానం చేస్తే పితృ ఋణం తీరితుంది. అహస్సు, సు దినం, అనే తీర్ధాలలో స్నామాచరిస్తే సూర్య లోక ప్రాప్తి కలుగుతుంది. మృగధూమం అనే క్షేత్రంలో గంగా స్నాన మాచరించి శివుని ఆరాధించిన అశ్వమేధ ఫలం కలు గుతుంది. వామన తీర్ధంలో స్నానం చేస్తే విష్ణు లోకానికి పో తారు. పావన తీర్ధంలో స్నానమాచరించిన వంశం పవిత్ర మౌ తుంది. శ్రీకుంజంలో తీర్ధాన్ని దర్శిస్తే బ్రహ్మలోకం సి ద్ధిస్తుంది. సప్తసారస్వతాలు అనే తీర్ధంలో స్నానంచేస్తే సమగ్ర సారస్వతప్రాప్తి కలుగుతుం ది. ఔశనశం, కపాల మో చనం, విశ్వా మిత్రం, కార్తికేయం అనే తీర్ధాలలో స్నానమాచరిస్తే పాప విముక్తులౌతారు. పృధూక తీర్ధంలో చనిపోతే పాపాల నుండి విముక్తులౌతారు.
              గంగా, సరస్వతీ సంగమంలో స్నానమాచరిస్తే బ్రహ్మ హత్యా పాతకం పోతుంది.శతం, సహస్రం అనే తీర్ధాలలో తపస్సు చేస్తే అంతులేని పుణ్యం వస్తుంది. రుద్రపత్ని అనే తీర్ధంలో స్నానం చేస్తే సర్వదు॰ఖ విముక్తి కలుగుతుం ది. స్వస్తి పురం అనే తీర్ధం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వేయి ఆవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఏకరాత్రం అనే తీర్ధంలో ఉపవాసం చేస్తే స్త్యలోకం సిద్ధిస్తుంది. ఆ దిత్యాశ్రమంలో సూర్య్డిని ఆరాధిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగు తుంది. దధీచి తీర్ధంలో మూడురాత్రులు నివసిస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. స్యర్యగ్రహణ సమయంలో సన్ని హిత తీర్ధంలోస్నానం చేస్తే నూరు అశ్వమేధాలు చేసిన ఫలం పొందు తారు. ధర్మతీర్ధంలో స్నానం చేస్తే ధర్మాచరణ కలుగుతుంది. జ్ఞానపావనం, సౌగంధికం అనే తీర్ధాలలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి.సరస్వతీ హ్రదం నుం డి వచ్చే జలంలో స్నానం చేస్తే అశ్వమేధయాగమ్ ఛెశీణా ఫాళామ్ వ్స్తుంది. శాకంబరీ తీర్ధంలో ఒక రోజు శాకాహార తపస్సు చేస్తే పణ్యం లభిస్తుంది. ధూమావతీ, రధావర్తం అనే తీర్ధాలలో స్నానం చేస్తే దు॰ఖం నుండి విముక్తు లౌ తారు.

22 మార్చి, 2012

హనుమంతుడు భీమసేనునికి చెప్పిన యుగధర్మాలు

ఒకరోజు ద్రౌపది భీముడు గంధమాధన పర్వతచరియలలో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చట పడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముని కోరింది. ద్రౌపది కోరిన సౌగంధికా పుష్పాలు తెచ్చేందుకు బయలుదేరాడు. అలా వెళుతూ భీముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. ఈ శబ్ధాలను అక్కడ ఉన్న హనుమంతుడు విన్నాడు. ఆ వచ్చినది తన సోదరుడు భీముడని గ్రహించాడు. గుహలో నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న చెట్లను పెరికి దారికి అడ్డం వేసాడు. తాను కూడా దారికి అడ్డంగా పడుకుని తోకను విలాసంగా ఆడించసాగాడు. 
భీముడు అక్కడికి వచ్చి హనుమంతుని చూసి సింహనాదం చేసాడు.ఆ శబ్ధానికి హనుమంతుడు కళ్ళు తెరిచి " ఎవరయ్యా నీవు? పెద్దవాడిని, అలసిపోయి పడుకున్న వాడిని పడుకుని ఉంటే ఇలా అరవడం తగునా? అడవిలో ఉన్న పండ్లు ఫలాలు తిని వెళ్ళు ఇలా అరవకు " అన్నాడు హనుమంతుడు. భీముడు " నేను పాండురాజు పుత్రుడను, ధరాజు తమ్ముడిని. నా నామధేయం భీమసేనుడు. నేను కార్యార్ధినై వెళుతున్నాను. నాకు దారి వదులు " అన్నాడు. హనుమండు " నేను ముసలి వాడిని కదలలేను. నీవే నా తోకను పక్కన పెట్టి నీ దారిన నీవు వెళ్ళచ్చు " అన్నాడు హనుమంతుడు. భీముడు అదెంత పని అని తోకను ఒక్క చేత్తో ఎత్తి పెట్టబోయాడు. తోక కదల లేదు.రెండు చేతులు ఎత్తి పట్టుకుని ఎత్తబోయాడు. అప్పుడూ కదల లేదు. భీముడు అది చూసి ఆశ్చర్య పోయాడు.
భీముడు హనుమంతునితో "అయ్యా! మీరెవరో నాకు తెలియదు.కాని మీరు మహాత్ములు. నన్ను మన్నించండి " అన్నాడు. హనుమంతుడు భీమునితో " భీమా! నేను హనుమంతుడిని, నీ అన్నను వాయు పుత్రుడను. నేను రామబంటును. రావాణుడు రాముని భార్యను అపహరించగా నేను లంకకు వెళ్ళి సీతమ్మ జాడను తెలుసుకుని రామునికి తెలిపాను. రాముడు రావణుని సంహరించి సీతమ్మను పరిగ్రహించాడు. రాముడు నా సేవలకు మెచ్చి నన్ను చిరంజీవిగా ఉండమని దీవించాడు " అప్పటి నుండి నేను గంధమాధన పర్వతంపై నివసిస్తున్నాను " అని చెప్పాడు.అది విన్న భీముడు సంతోషించి "ఆంజనేయా! నీవు అలనాడు సముద్రాన్ని లంఘించిన రూపాన్ని చూడాలని కోరికగా ఉంది. ఒక్క సారి చూపించవా? " అని అడిగాడు. హనుమంతుడు "భీమా! అది ఎలా కుదురుతుంది. ఆ కాలం వేరు ఈ కాలం వేరు యుధర్మాలు కృతయుగంలో ఒకలా , త్రేతాయుగంలో వేరేలా, ద్వాపరంలో మరోలా ఉంటుంది. అలాగే కలియుగంలో పూర్తి విరుద్ధంగా ఉండబోతుంది " అన్నాడు.
భీముడు " అన్నయ్యా! ఆయా యుగాలలోని ఆచారాల గురించి చెప్పవా? " అన్నాడు. హనుమంతుడు ఇలా చెప్పసాగాడు " భీమసేనా! కృతయుగంలో అన్నీ కృతములే కాని చెయ్యవలసినది ఏమీ లేదు. అందుకనే ధర్మం నాలుగు పాదాలతో నడిచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వేదాలు తమకు విధించిన విధులు నిర్వర్తించారు. వారు కోరకుండానే తగిన ఫలితాలు కలిగాయి. కనుక వారు పుణ్యలోకాలకు పొందారు. ఆ యుగంలో జనులకు అసూయ, ద్వేషము, గర్వము, మదము, మాత్సర్యము, కోపము, భయం, సంతాపం, ప్రజాక్షయం, అవయవక్షయం లాంటివి లేవు.
 తరవాత త్రేతాయుగం ఆరంభమైంది. ధర్మం మూడుపాదాలతో నడిచింది. ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు, యజ్ఞయాగాదులు చేసే వారు, తపస్సులు చేసే వారు, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజలను రక్షించాడు. ద్వాపరయుగం వచ్చింది. ధర్మం రెండు పాదాలతో నడిచింది. వేదములు, శాస్త్రములు విధించిన ధర్మము కామము అనుసరించబడ్డాయి. కాని ద్వాపరయుగంలో ప్రజలు మాటమీద నిలవరు, సత్యము శమము హీనమౌతుంది. ప్రజలు కామ్యార్ధం మాత్రమే యజ్ఞాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో ప్రజా రక్షణ చేస్తాడు. తరవాత వచ్చునది కలియుగం . 
ఈ యుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుంది. విష్ణువు పసుపు పచ్చని వర్ణంతో లాలాలను రక్షిస్తాడు. కలియుగంలో జనులు తమోగుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామము, క్రోధము మొదలైన వాటికి వశులై అధర్మ వర్తనుడై ప్రవర్తిస్తారు. కలియుగంలో తపస్సు, ధర్మము, దానము లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరించబడతాయి. కాని వాటికి ఫలితం విసేషంగా ఉంటాయి " అని హనుమంతుడు చెప్పాడు. భీముడు "ఆంజనేయా! అలనాడు నీవు సాగరం దాటిన భీమరూపాన్ని చూడకుండా నేను ఇక్కడ నుండి కదలను " అన్నాడు.
ఆంజనేయుడు సాగరాన్ని దాటినప్పటి రూపాన్ని భీమునకు చూపాడు. రెండవ మేరు పర్వతమా అని భ్రమింప చేసే ఆంజనేయుని విరాట్రూపం చూసి భీముడు భీతి చెంది ఆ రూపాన్ని ఉపసంహరింపమని హనుమంతుని వేడుకున్నాడు. హనుమంతుడు రూపాన్ని ఉపసంహరించి "భీమసేనా! నీవు కావాలి అనుకున్న సౌగంధికా పుష్పములు ఉన్న కొలనును యక్షుల, గంధర్వులు సంరక్షిస్తుంటారు. అక్కడ నీ శౌర్యప్రతాపాలు పనికి రావు. ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తుంటారు. దేవతలు భక్తికి లొంగుతారు కనుక ధర్మమెరిగి ప్రవర్తించు. సదాచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదం ప్రతిష్టించ బడుతుంది. వేదముల వలన యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలవలన దేవతలు సంతృప్తి చెం

దుష్టులతో స్నేహం

ఒక రోజు ఓ నక్క నదీ తీరాన్న కూర్చుని భోరు భోరుమని ఎడుస్తోంది. అది విని చుట్టు పక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయిటికి వచ్చి నక్కను “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాయి.“అయ్యో! నన్ను నా బృందంలోని వేరే నక్కలన్ని అడివిలోంచి తరిమేసేయి” అని ఎడుస్తూనే సమధనమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకల జరిగిందని అడిగాయి.

             “ఎందుకంటే ఆ నక్కలన్ని మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుంతుంటే నేను వద్దన్నాను – మీ లాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి?” అంది నక్క. “ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు” అని అడిగాయి పీతలు. “తెలీదు, ఎమైనా పని చూసుకోవలి” అని దీనంగా జవబిచ్చింది ఆ నక్క. పీతలన్ని కలిసి అలోచించాయి. “మన వల్లే దీనికీ కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి” అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి వుండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకుని కృతఙతలు తెలిపింది. రోజంతా పీతలతో వుండి వాటికి కథలు కబుర్లూ చెప్పి నవ్విస్తూనే వుంది.

               రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంత వెన్నెలతో వెలిగిపోయింది.“ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైన విహరించారా? చాలా బగుంటుంది” అని నక్క పీతలని అడిగింది. భయంకొద్ది ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళ లేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీస్కుని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడ బయలుద్యారాయి.

                  కొంత దూరమెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది. పీతలన్ని ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హటాత్తుగా అడివిలోంచి చాలా నక్కలు బయిటికి వచ్చి పీతల పైబడ్డాయి. పీతలు బెదిరిపోయి అటు ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కాని నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి.ఎలాగోలాగ ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతికష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధ పడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్ధమయ్యింది.

తపస్సు వలన వచ్చే విద్య వలన జరిగే అనర్ధాలు

రైభ్యుడు, భరద్వాజుడు అనే మహా ఋషులు ఉన్నారు. వారిరువురు మిత్రులు. వారిద్దరు అడవిలో తపస్సు చేసుకుంటున్నారు. రైభ్యునికి అర్ధావసుడు, పరావసుడు అనే కుమారులు ఉన్నారు. వారిద్దరూ మంచి విద్యావంతులు. భరద్వాజునికి ఒక కుమారుడుండే వాడు. అతని పేరు యువక్రీతుడు. యువక్రీతునకు అర్ధావసు పరావసు అంటే అసూయ. అందుకని కష్టపడకుండా సకల విద్యలు రావాలనే సంకల్పించి ఇంద్రిని గురించి తపస్సు చేసాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై "ఏ కోరికతో ఇంత ఘోర తపస్సు చేసావు ? "అని అడిగాడు. యువక్రీతుడు "నాకు చదవకుండానే సకల శాస్త్రాలు, వేదాలు అవగతం కావాలి " అని కోరాడు. ఇంద్రుడు " ఇది అసంభవం. తపస్సు వలన వచ్చే విద్య మత్సరాన్ని కలిగిస్తుంది. అది మంచిది కాదు. విద్య గురు ముఖత॰ నేర్చుకోవడం ఉత్తమం " అన్నాడు.అందుకు యువక్రీతుడు అంగీకరించ లేదు.
ఇంద్రుడు వెళ్ళి పోయాడు. యువక్రీతుడు తపస్సు కొనసాగించాడు. మరల ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అక్కడ ప్రవహిస్తున్న గంగా ప్రవాహానికి అడ్డంగా పిడికిళ్ళతో ఇసుక పోసి సేతుబంధనం చేయసాగాడు. అది చీసి యువక్రీతుడు నవ్వి " వృద్ధుడా! ఇదేమి పని? ఇలా ఎన్ని రోజులు చేస్తే ఈ సేతువు పూర్తి ఔతుంది " అన్నాడు. ఆ వృద్ధుడు "నేను నీలా సాధ్యం కాని దాని కోసం ప్రయత్నిస్తున్నాను " అన్నాడు. ఇంద్రుడు నిజరూపం చూపి "యువక్రీతా ! నేను చేసిన పని ఎంత నిరర్ధకమో నీవు చేసే తపస్సు అంతే నిరర్ధకం. కనుక నీ ప్రయత్నం మానుకో " అన్నాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించక తనకు సకల విద్యలు కావలసిందేనని పట్టు పట్టాడు. ఇంద్రుడు చేసేది లేక అతనికి సకల విద్యలు ప్రసాదించాడు.
తన కోరిక తీరిందని గర్వంతో తన తండ్రి వద్దకు వచ్చాడు. తన పాండిత్యంతో ఎంతో మందిని ఓడించాడు. ఒకరోజు యువక్రీతుడు తన తండ్రి మిత్రుడైన రైభ్యుని చూడటానికి వెళ్ళాడు. అక్కడ రైభ్యుని పెద్ద కుమారుడైన పరావసు భార్య అయిన కృష్ణ అనే సుందరిని చూసాడు. ఆమెను మోహించి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ఆముని శాపానికి భయపడి ఏదో సాకు చెప్పి తప్పించుకుని పోయింది. ఆమె ఆ విషయం తన మామగారికి చెప్పి కన్నీరు పెట్టింది. రైభ్యుడు ఆగ్రహించి తన జటాజూటం తీసి అగ్నిలో వేసి ఒక రాక్షసుని సృష్టించాడు. మరొక జటను లాగి అగ్నిలో వేసి కృష్ణ లాంటి కన్యను సృష్టించాడు. వారిరువురిని చూసి " మీరు యువక్రీతుని వధించండి " అని పంపాడు. ముందు ఆయువతి అందంతో యువక్రీతుని మైమరపించి కమండలం సంగ్రహించింది. కమండలం పోగానే యువక్రీతుడు అపవిత్రుడు అయ్యాడు.వెంటనే రాక్షసుడు యువక్రీతుని వధించాడు. ఆ తరవాత రైభ్యుడు ఆ యువతిని రాక్షసునికి ఇచ్చి వివాహం చేసాడు. ఆశ్రమానికి వచ్చిన భరద్వాజుడు కుమారుని మరణ వార్త విని పుత్ర శోకం భరించ లేకగ్ని ప్రవేశం చేసి మరణించాడు. తరవాత కొన్నాళ్ళకు బృహద్యుముడు అనే రాజు సత్రయాగం చేస్తున్నాడు. ఆ యాగానికి పరావసు, అర్ధావసులను ఋత్విక్కులుగా నియమించాడు.
యజ్ఞం జరుగుతున్న సమయంలో ఒక రాత్రి పరావసు ఆస్రమానికి వచ్చేసమయంలో ఏదో అలికిడి వినిపించింది. పరావాశూ ఎదో క్రూరమృగం వస్తుంది అనుకుని ఎదురుగా వస్తున్న రైభ్యుని ఆత్మరక్షణార్ధం చంపాడు. దగ్గరికి వచ్చి చూసి తన తండ్రిని గుర్తించి కుమిలి పోయాడు. అతనికి దహన సంస్కారాలు ముగించాడు. తన అన్న వద్దకు పోయి జరిగినది చెప్పాడు. పరావసు అర్ధవసుతో "అన్నయ్యా ! నీవు ఒక్కడివి ఆ యాగాన్ని నిర్వహించ్ లేవు కాని నేను ఒక్కణ్ణి చేయగలను. కనుక నేను ఆ యాగాన్ని పోయి ఆయాగాన్ని పూర్తి చేస్తాను. నీవు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్యాపాతకానికి పరిహారం చెయ్యి " అన్నాడు. 
అలాగే అని అర్ధావసు తమ్ముని బదులు అన్ని ప్రాయశ్చితములు పూర్తి చేసి యాగశాలకు తిరిగి వచ్చాడు. అతనిని చూసి పరావసు బృహద్యుమ్నినితో ఇలా అన్నాడు " మహారాజా! ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి అర్హుడు కాదు. పవిత్రమైన యాగక్రతువును విడిచి బ్రహ్మహత్యా ప్రాయశ్చిత కార్యం చేస్తున్నాడు " అన్నాడు.రాజు అనుచరులు పరావసుని యాగశాలలోకి రాకుండా అడ్డుకున్నారు. అర్ధావసు రాజును చూసి " రాజా బ్రహ్మహత్యా పాతకం చేసినది నేను కాదు. ఈ పరావసు చేసిన బ్రహ్మ హత్యకు నేను పెరాయశ్చిత కర్మలు చేసి వస్తున్నాను. అతడిని బ్రహ్మహత్యా పాతకము నుండి విముక్తుడిని చేసాను " అని సత్యం చెప్పాడు.
అందుకు దేవతలు సంతోషించి " అర్ధవసూ! నీ సత్యవ్రతం గొప్పది. నీ తమ్ముడు చేసిన బ్రహ్మహత్యకు నీవు ప్రాయశ్చితం చేసావు. ఏమి వరం కావాలో కోరుకో " అని అడిగారు. అర్ధవసుడు "అయ్యా! నా తండ్రిని, భరద్వాజుని, యువక్రీతున బ్రతికించండి అలాగే నాతమ్ముని దోషం కూడా పరిహరించండి " అని కోరుకున్నాడు. దేవతలు అందరిని బ్రతికించారు. యువక్రీతుడు దేవతలను చూసి " దేవతలారా! నేను ఎన్నో విద్యలు చదివాను, వ్రతాలు చేసాను కాని రైభ్యునిచే చంపబడ్డాను. కారణం ఏమిటి? " అని అడిగాడు. దేవతలు " యువక్రీతా! గురుముఖత॰ నేర్చుకున్న విద్య ఫలిస్తుంది, తపస్సు వలన నేర్చుకున్నవి ఫలించవు కనుక నీ విద్యలు నిర్వీర్యం అయ్యాయి. రైభ్యుని విద్య గురువు నేర్పినది కనుక అతడు నీ కంటే శక్తిమంతుడు అయ్యాడు. అని పలికి స్వర్గాలికి వెళ్ళారు.

21 మార్చి, 2012

పరశురాముడు

పూర్వం కన్యాకుబ్జం అనే నగరాన్ని గాధిరాజు పాలించేవాడు. అతని కుమార్తె సత్యవతి. ఆమెను బృగుమహర్షి కొడుకు ఋచీకుడు వివాహమాడాలని అనుకున్నాడు. అతడు గాధిరాజు వద్దకు వచ్చి సత్యవతిని ఇమ్మని అడిగాడు. అందుకు గాధిరాజు "మహాత్మా! ఒక చెవి నల్లగా మిగిలిన శరీరం తెల్లగా ఉండే వేయి గుర్రాలను కానుకగా ఇచ్చి నా కూతురిని వివాహం చేసుకో " అని అన్నాడు. ఋచీకుడు అలాగేఅని చెప్పాడు. అతడు వరుణిని ప్రాంర్ధించాడు. అప్పుడు గంగా నది నుండి వేయి గుర్రాలు ఋచీకుడు కోరిన విధంగా పుట్టాయి. అప్పటి నుండి గంగా నదికి అశ్వతీర్ధం అనే పేరు వచ్చింది. గుర్రాలను కానుకగా ఇచ్చి ఋచీకుడు గాధి కూతురిని వివాహమాడాడు.

ఒక సారి బృగు మహర్షి వారి ఇంటికి వచ్చి కొడుకు కోడలిని దీవించాడు. కోడలిని వరం కోరుకొమ్మని అడిగాడు. ఆమె మామగారిని చూచి నాకు ఒక కుమారుడు అలాగే నా తల్లికి ఒక కుమారుని ప్రసాదించండి అని కోరింది. అలాగే అని భృగువు "మీరిరువురు స్నానం చేసి నీవు మేడి చెట్టును మీ తల్లి అశ్వత్థ వృక్షాన్ని కౌగలించుకోడి మీ కోరిక నెరవేరుతుంది " అన్నాడు. సత్యవతి, ఆమె తల్లి స్నానం చేసి ఆమె అశ్వత్థవృక్షాన్ని, ఆమె తల్లి మేడి వృక్షాన్ని పొరపాటున కౌగలించుకున్నారు. 

               విషయం తెలిసిన భృగువు కోడలితో " అమ్మా! నీకు బ్రహ్మకుల పూజ్యుడైన కుమారుడు జన్మిస్తాడు. కాని అతడు దారుణమైన క్షాత్రధర్మాన్ని అవలంబిస్తాడు. నీ తల్లికి ఒక క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు. కాని అతడు మహా తపశ్శాలి, బ్రహ్మజ్ఞాని ఔతాడు " అన్నాడు. అప్పుడు సత్యవతి దారుణమైన క్షాత్రధర్మం తన కుమారునికి లేకుండా తన మనుమడికి రావాలని కోరింది. భృగువు అలాగే జరుగుతుందని చెప్పి వెళ్ళాడు. సత్యవతి గర్భం ధరించి జమదగ్ని అనే కుమారుని కన్నది. జమదగ్ని ప్రసేన జితుడు అనే రాజు కుమార్తె రేణుకను వివాహమాడాడు. వారికి ఋమణ్వంతుడు, సుషేణుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనే కుమారులు కలిగారు.

    ఒకరోజు జాదగ్ని భార్య రేణుక నీటికోసం ఒక సరస్సుకు వెళ్ళింది. ఆసమయంలో చిత్రరధుడు అనే రాజు తన రాణులతో జలకాలాడటం చూసింది. రాజును చూచి రేణుకకు మోహం కలిగింది. రేణుక మనసు చలించడం గ్రహించిన జమదగ్ని ఆగ్రహించి వరసగా తన కుమారులను పిలిచి ఆమెను వధించమని ఆజ్ఞాపించాడు. వారు తల్లిని చంపుట మహాపాపమని నిరాకరించారు. జ్ఞమదగ్ని ఆగ్రహించి వారిని అడవిలో మృగప్రాయులుగా తిరగమని శపించాడు. ఆఖరిగా రాముని పిలిచి రేణుకను వధించమని చెప్పాడు.అతడు ఎదురు చెప్పక తన చేతిలోని గొడ్డలితో తల్లి తల నరికాడు. జమద్గ్ని సంతోషించి "నా మాట మన్నించి నందుకు నీకేమి వరం కావాలి ? కోరుకో " అన్నాడు.

  రాముడు "తండ్రీ !ముందు నా తల్లిని బ్రతికించండి.తరవాత నా అన్నలను శాపవిముక్తులను చేయండి. నాకు దీర్గాయువు, అమితమైన బలం ప్రసాదించండి. సదా శత్రుజయం ప్రసాదించండి " అని కోరాడు. జమదగ్ని అతనుకోరిన వరాలన్నీ ఇచ్చాడు. ఒకరోజు సహస్రబాహువులు కలిగిన కార్తవీర్యార్జునుడు వేటాడుతూ అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని అతనికి తగిన అతిధి సత్కారాలు చేసాడు. కార్తవీర్యుడు రాజగర్వంతో జమదగ్నిని ఇతర మునులను అవమానించాడు. పోతూ పోతూ ఆశ్రమంలోని హోమధేనువును దూడను తీసుకు వెళ్ళాడు. రాముడు ఆసమయంలో ఆశ్రమంలో లేడు. 

    రాముడు రాగానే జరిగినదంతా తండ్రి ద్వారా తెలుసుకున్నాడు. రాముడు ఆగ్రహించి కార్తవీర్యునితో యుద్ధం చేసి అతనిని వధించాడు. కార్తవీర్యుని కొడుకులు రాముడి పై పగపట్టారు. కానీ అతనిని ఏమి చెయ్యలేమని గ్రహించి రాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి జమదగ్నిని చంపి మునులను నిందించి ఆశ్రమాన్ని ధ్వంశం చేసి వెళ్ళారు. రాముడు ఆశ్రమానికి రాగానే తండ్రి మరణ వార్త విని కృద్ధుడై "అనఘుడు, వీతరాగుడు, కరుణాతరంగుడు అయిన నా తండ్రిని బుద్ధి పూర్వకంగా చంపారు కనుక నేను దుర్జనులైన క్షత్రియులను అందరిని చంపుతాను " అని ప్రతిజ్ఞ చేసాడు. ఇలా భూలోకంలోని క్షత్రియులందరిని సంహరించి భూమిని కశ్యపునకు దానం ఇచ్చాడు. తరువాత విరాగియై మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్నాడు.