నది ఒడ్డున ఉన్న ఒక మర్రిచెట్టుపైన ఒక పావురం నివసిస్తూంది.ఒకరోజు అది నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమను చూసింది.ఆ చీమను ఎలాగైన కాపాడాలి అనుకున్నది.వెంటనే ఒక మర్రి ఆకును తెంపి చీమకు దగ్గరలో నీళ్ళలో వేసింది పావురం.
ఆ అకుపై చీమ ఎక్కి కూర్చుంది.తేలుతున్న ఆ ఆకు ఒడ్డును చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది. పావురమును చూసి అది చేసిన సహాయానికి తన ధన్యవాదాలను తెలియజేసింది చీమ. ఒకరోజు చీమ పక్షులకోసం నాలుగువైపుల గాలిస్తున్న వేటగాన్ని చూసింది.చెట్టుపైన కూర్చుని ఉన్న తన ప్రాణాలను కాపాడిన పావురాన్ని చూసింది.ఆ వేటగాడు చెట్టుపైన కూర్చున్న పావురం పైకి విల్లు ఎక్కు పెట్టి గురి పెట్టాడు.ఇది గమనించిన చీమ పరుగున వేటగాడిని సమీపించి ఆలస్యం చేయకుండ కుట్టింది.బాదతో వెటగాడు అరిచాడు.బాణం గురి తప్పింది.పావురం అక్కడి నుండి ఎగిరిపోయింది.వేటగాడు వెళ్ళిపోయాక పావురం తనకు ప్రత్యుపకారం చేసిన చీమకు ధన్యవాదాలు చెప్పుకుంది.
very good blog, thank you. I need to tell at least one story to my daughter every day.
రిప్లయితొలగించండిThanks for your comments, Keep reading
రిప్లయితొలగించండిచిన్నప్పుడు రెండూ, మూడు తరగతుల్లో అనుకుంటా.. తెలుగు పుస్తకంలో చిన్న చిన్న బొమ్మలకి వ్యాఖ్యానం రాస్తూ ఈ కథ ఉండేది. మీరు చిన్ననాటి కథలన్నీ భలే గుర్తు చేస్తున్నారండీ.. మీ బ్లాగు చాలా బాగుంది. :)
రిప్లయితొలగించండికనీసం ఒక్కరైనా ఈ గుర్తులను పంచుకోవాలనుకుంటున్నారు..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిస్పందించిన అందరికీ ధన్యవాదములు :)
రిప్లయితొలగించండి