13 మే, 2013

ఉత్తమజ్ఞానం

పులస్త్యుడు అనే వ్యక్తి ఉత్తమజ్ఞానం బోధించే గురువు కోసం నిరంతర అన్వేషణ చేయసాగాడు. ఎందరెందరో జ్ఞానులను కలుసుకున్నాడు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిం చాడు. అయినా అతని కోర్కె ఫలించలేదు. ఎందరో మహిమాన్వితులను కలుసుకుని తన వాంఛితాన్ని తెలియజేశాడు. కానీ అతనికి తృప్తికరమైన బోధన లభించలేదు.

తిరిగి తిరిగి అలసిపోయిన పులస్త్యుడు ఒకనాడు ఒక గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటుతున్నాడు. పులస్త్యుడు అక్కడే కూర్చుని తదేకంగా చూడసాగాడు. మరు సటి రోజు భారీ వర్షం కురిసి విత్తనాలన్నీ కొట్టుకుపోయాయి.

రైతు మళ్లీ వేరే విత్తనాలు తెచ్చి నాటాడు. ఆ తర్వాత వర్షమే పడలే దు. రైతు దూరంగా బావి నుంచి నీళ్లు తోడి పోశాడు. కానీ బావి కూడా ఎండిపోయింది. రైతు పట్టువిడవకుండా ఇంకా ఎంతో దూరంలో వున్న నది నుంచి నీళ్లు తెచ్చిపోయసాగాడు. క్రమంగా విత్తనాలు మొలకెత్తాయి. పంట దండిగా పండింది. రైతు హాయి గా పంట కోసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. పులస్త్యుడికి అసలు విషయం అర్థమైంది.

ఉత్తమజ్ఞానం ఎక్కడో లేదు, మనచుట్టూ కనిపించే ప్రతి దానిలోనూ వుంటుంది. అదే రైతు తనకు ఇచ్చిన ఉపదేశంగా భావించాడు పులస్త్యుడు.
రత్నగిరి రాజ్యాన్ని పరిపాలించిన జయంతుడు అనే మహారాజుకు వరుణుడు, సంజయుడు, సుధీరుడు అనే ముగ్గురుకొడుకులు ఉండేవారు.
వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన జయంతుడు తన తర్వాత రాజ్యభారాన్ని ముగ్గురు కొడుకులలో ఎవరికి అప్పగించాలా అని ఆలోచించసాగాడు. మంత్రిని పిలిచి ఈ విషయం చెప్పగా, ‘‘ఇందులో సందేహం ఏముంది మహారాజా! సంప్రదాయం ప్రకారం పెద్దకుమారునికే రాజ్యాధికారం లభిస్తుంది’’ అన్నాడు.

‘‘కానీ మంత్రివర్యా! నా ముగ్గురు కుమారులలో మిక్కిలి తెలివైనవాడికే పట్టాభిషేకం చేయాలన్నది నా కోర్కె’’ అన్నాడు రాజు.

కొద్దిరోజుల తర్వాత ఒకనాడు రాజు పెద్ద కొడుకు వరుణుడిని పిలిచి ఇక్కడ ఉన్న మూడు గదులలో ఒక దానిలో దండిగా ధాన్యరాశులు ఉన్నాయి. రెండవదానిలో ఆయుధ సంపత్తి ఉంది. మూడవదానిలో పుష్కలమైన ధనరాశులు ఉన్నాయి. ప్రజాక్షేమం దృష్ట్యా ఏదో ఒక గదిని కోరుకోమంటే నీవు ఏ గదిని కోరుకుంటావు?’’ అని ప్రశ్నించాడు.

‘‘ప్రజలకు అన్నిటికంటే ఆహారం ముఖ్యం. అందువల్ల ధాన్యరాశులు కోరుకుంటాను’’ అన్నాడు వరుణుడు.

రెండవ కొడుకు సంజయుడిని పిలిచి ఇదే ప్రశ్నవేయగా ‘‘శత్రువులు దండెత్తివచ్చినప్పుడు తింటూ కూర్చుంటే సరిపోదు. యుద్ధం చేయడానికి ఆయుధాలు కావాలి కాబట్టి ఆయుధాలున్న గదినే కోరుకుంటాను’’ అన్నాడు.

మూడవ కొడుకు సుధీరుడిని పిలిచి ప్రశ్నించగా ‘‘నేను ధనరాశులున్న గదినే కోరుకుంటాను. ఎందుకంటే పుష్కలమైన ధనం ఉంటే ఆహారం, ఆయుధాలు ఎంతైనా సమకూర్చుకోవచ్చు. మిగిలిన ధనంతో ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించవచ్చు’’ అన్నాడు.
రాజు సుధీరుడికి పట్టాభిషేకం చేసి, తాను వానప్రస్థానికి తరలిపోయాడు. - See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62123&Categoryid=13&subcatid=0#sthash.7lOilr5W.dpuf
హోం > వివరాలు

ఉపదేశం
 పులస్త్యుడు అనే వ్యక్తి ఉత్తమజ్ఞానం బోధించే గురువు కోసం నిరంతర అన్వేషణ చేయసాగాడు. ఎందరెందరో జ్ఞానులను కలుసుకున్నాడు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిం చాడు. అయినా అతని కోర్కె ఫలించలేదు. ఎందరో మహిమాన్వితులను కలుసుకుని తన వాంఛితాన్ని తెలియజేశాడు. కానీ అతనికి తృప్తికరమైన బోధన లభించలేదు. - See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62245&Categoryid=13&subcatid=0#sthash.lhoKIjZ5.dpuf

పులస్త్యుడు అనే వ్యక్తి ఉత్తమజ్ఞానం బోధించే గురువు కోసం నిరంతర అన్వేషణ చేయసాగాడు. ఎందరెందరో జ్ఞానులను కలుసుకున్నాడు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిం చాడు. అయినా అతని కోర్కె ఫలించలేదు. ఎందరో మహిమాన్వితులను కలుసుకుని తన వాంఛితాన్ని తెలియజేశాడు. కానీ అతనికి తృప్తికరమైన బోధన లభించలేదు - See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62245&Categoryid=13&subcatid=0#sthash.lhoKIjZ5.dpuf

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి