18 అక్టోబర్, 2013

చెప్పే విధానంలో తేడా!!!

ఒక రోజు రాత్రి అక్బరుకి తన పళ్ళన్నీ రాలిపోయినట్టు కల వచ్చింది. కంగారుగా నిద్రలో నుండి లేచి, వెంటనే ఆస్ధాన జ్యోతిష్యులను పిలిపించాడు. ఆదుర్దాగా వచ్చిన జ్యోతిష్యులకు తన కల గురించి చెప్పి, దాని   పర్యవసానాలు వివరించమన్నాడు. 

జ్యోతిష్యులు చాలాసేపు చర్చించుకుని, "అయ్యా! తమరి కలకు గొప్ప అర్ధమే ఉంది. విన్నవించమంటారా?" అని అడిగారు.  "కానీయండి" అన్నాడు అక్బర్‌.  "జహాపనా! మీ బందువులందరూ మీకంటే ముందుగా చనిపోతారు ప్రభూ" అన్నారు. 

అక్బరుకి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో జ్యోతిష్యులను మందిరం నుండి పంపి వేశాడు. ఆ మరుసటి ఉదయం, యధాలాపంగా బీర్బల్ రాజుగారిని కలుసుకునేందుకు వెళ్లాడు. బీర్బల్‌కి కూడా రాజు తన కల గురించీ, జ్యోతిష్యులు చెప్పిన విషయం గురించీ చెప్పాడు. విషయం అర్ధమైన బీర్బల్‌ - "జహాపనా! నాకూ కొద్దిగా స్వప్న ఫలితాల జ్ణానం ఉంది. మీ కల ప్రకారం మీ బందువలందరికంటే మీరు ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారని అనిపిస్తోంది" అన్నాడు. 

ఈ సమాధానికి అక్బరు సంతోషించి బీర్బల్‌ని సత్కరించి పంపాడు. జ్యోతిష్యులు చెప్పిందీ, తను చెప్పిందీ ఒకటే అయినా, చెప్పే విధానంలో తేడా అక్బరుకి తెలియనందుకు సంతోషించాడు బీర్బల్‌.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి