ఒకరోజు సభలో అక్బర్ చక్రవర్తి బీర్బల్‌ను ఈ విధంగా ప్రశ్నించాడు. "ఒక వ్యక్తి ఒకే సమయంలో బీదవాడు మరియు గొప్పవాడుగా గుర్తింపు పొందడం సాధ్యమవుతుందా?" "సాధ్యమవుతుంది ప్రభూ" అని చెప్పాడు బీర్బల్. " అలాగా! అయితే అలాంటి వ్యక్తిని నాకు చూపించగలవా?" . "తప్పకుండా చూపిస్తాను ప్రభూ" అని బీర్బల్ సభ నుండి బయటకు వెళ్ళి పోయాడు. కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని సభకు తిరిగి వచ్చాడు. "ఇతను కడు బీదవాడు ప్రభూ! బిచ్చ మెత్తుకుని జీవిస్తాడు" బీర్బల్ ఆ వ్యక్తిని అక్బరు ముందు నిలబెడుతూ చెప్పాడు.
"ఆ విషయం చూస్తేనే అర్ధం అవుతోంది. మరి ఇతను గొప్పవాడు ఎలా అవుతాడు?" ఆసక్తిగా అడిగాడు అక్బరు. "ఒక చక్రవర్తితో పాటు ఇతను కూడా ప్రజల ముందు సత్కారాన్ని పొందగలిగితే, ఇతను తన బిచ్చగాళ్ళ మధ్య గొప్పవాడిగా గుర్తింపు పొందుతాడు" అన్నాడు బీర్బల్.
బీర్బల్ చాతుర్యానికి అక్బరు చక్రవర్తి ఎంతో ఆనందించాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి