5 జూన్, 2011

"పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"




తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
—శ్రీ కృష్ణదేవ రాయలు



తియ్యని తేనెల తెలుగు పలుకక
ఇంగ్లిష్ మీద మోజు పడుట
ఇంట కమ్మని భోజనముండగా
హోటళ్ళ కెగబ్రాకినట్లు భార్గవ -
—చేరువేల భార్గవ శర్మ


జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
— వినుకొండ వల్లభరాయడు


“   సంస్కృతంబులోని చక్కెర పాకంబు
       అరవ భాషలోని అమృతరాశి
       కన్నడంబులోని కస్తూరి వాసన
         కలిసిపోయె తేట తెలుగునందు?
— మిరియాల రామకృష్ణ

1 కామెంట్‌: